జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడానికి మే 1 చివరి రోజు. దీంతో భారత్ సహా కొన్ని జట్లు ఈరోజు జట్టును ప్రకటించాయి.ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ఎట్టకేలకు ప్రకటించింది. టీమ్ ఇండియాను సెలక్టర్లు ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై కోట్లాది మంది క్రికెట్ అభిమానువేయి కళ్లతో ఎదురు చూశారు.
తాజాగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేశారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను జూన్ 1 నుంచి 29 వరకు యూఎస్‌ఏ, వెస్టిండీస్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించనున్నాయి.అయితే హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా హార్దిక్ చెప్పినట్లు రాణించలేకపోతున్నాడు. తొమ్మిది మ్యాచులు ఆడిన హార్దిక్ 151.24 స్టైక్ రేట్ తో.. 197 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ 227 పరుగులు సమర్పించి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
ఇదిలా ఉండగా వ్యతిరేకత ఉన్నప్పటికీ అతనికి ఎందుకు అవకాశం ఇచ్చారని అభిమానులు సోషల్ మీడియాలో బీసీసీఐని ప్రశ్నించారు. హార్దిక్ కు సరైన ఫిట్‌నెస్ కూడా లేదని అంటున్నారు.వన్డే ప్రపంచకప్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. తర్వాత కోలుకున్న హార్దిక్ ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్నాడు. అయితే బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మకు బదులుగా హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా చేసినప్పటి నుండి పాండ్యాపై వ్యతిరేకత పెరిగింది.
రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. రిజర్వ్ ప్లేయర్స్: శుబ్మాన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.