North Korea Missiles: ఉత్తర కొరియా గురువారం (మే 30) 10 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. వార్తా సంస్థ AP రిపోర్ట్ ప్రకారం, ఈ పరీక్ష తూర్పు సముద్రంలో (జపాన్ సముద్రం) జరిగింది. దక్షిణ కొరియా, జపాన్ సైన్యాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. క్షిపణుల ప్రయోగాన్నితీవ్రంగా ఖండించాయి.
అల్జజీరా రిపోర్ట్ ప్రకారం, గురువారం ఉదయం 6:14 గంటలకు ఉత్తర కొరియాలోని సునాన్ ప్రాంతం నుండి క్షిపణులను ప్రయోగించారు. దాదాపు 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఈ క్షిపణులు సముద్రంలో పడిపోయాయని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.
ఇది మన భద్రతకు ముప్పు: దక్షిణ కొరియా
North Korea Missiles: దక్షిణ కొరియా సైన్యం ఉత్తర కొరియా ఈ చర్య కొరియా ద్వీపకల్పం భద్రత, శాంతికి ముప్పు అని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో సైన్యం నిఘా పెంచింది. క్షిపణులకు సంబంధించిన మరింత సమాచారాన్ని పంచుకోవాలని అమెరికా, జపాన్‌లకు కూడా దక్షిణ కొరియా విజ్ఞప్తి చేసింది.
North Korea Missiles:ఈ క్షిపణుల ప్రయోగానికి కేవలం 3 రోజుల ముందు, ఉత్తర కొరియా తన రెండవ గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించింది. అయితే, అది విఫలమైంది. నిజానికి ఉపగ్రహాన్ని మోసుకెళ్తున్న రాకెట్ గాలిలోనే పేలిపోయింది. ఉత్తర కొరియా ఉపగ్రహ ప్రయోగానికి కొద్ది గంటల ముందు, దక్షిణ కొరియా రెండు దేశాల సరిహద్దు సమీపంలో 20 యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించింది.
జపాన్‌కు వచ్చే నౌకలపై సోదాలు..
North Korea Missiles: తమ సముద్ర సరిహద్దుల భద్రతను పెంచామని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జపాన్‌కు వచ్చే నౌకలపై సోదాలు జరుగుతున్నాయి. అమెరికా, జపాన్‌లతో సంయుక్త సైనిక విన్యాసాలపై దక్షిణ కొరియా చర్చలు జరుపుతున్న సమయంలో ఉత్తర కొరియా ఈ పరీక్షను నిర్వహించింది.
Also Read: 39 ఏళ్ల వయసులో క్రిస్టియానో రొనాల్డో రికార్డుల మోత!
North Korea Missiles: దీనికి ఒక రోజు ముందు, దక్షిణ కొరియా దృష్టిని మరల్చడానికి ఉత్తర కొరియా దక్షిణ కొరియా సరిహద్దులో చెత్తతో నిండిన బెలూన్‌లను విడుదల చేసింది. అలాగే దక్షిణ కొరియాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్ ఇచ్చారు.
అంతకుముందు, మార్చి 17న, దక్షిణ కొరియాలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పర్యటన సందర్భంగా ఉత్తర కొరియా మూడు బాలిస్టిక్ క్షిపణులను తూర్పు సముద్రం (జపాన్ సముద్రం)లోకి ప్రయోగించింది.
North Korea Missiles: ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ మార్చి 14న దక్షిణ కొరియాను ముప్పుగా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. యుఎస్ - దక్షిణ కొరియా సైనిక కసరత్తులకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా తరచుగా క్షిపణి ట్యాంకులు లేదా కొత్త ఆయుధాలను పరీక్షిస్తుంది. అమెరికా, దక్షిణ కొరియాలు మన దేశంపై దాడికి సిద్ధపడేందుకు విన్యాసాలు నిర్వహిస్తున్నాయంటూ ఆగష్టు 2023లో, కిమ్ జోంగ్ ఉన్ ప్రకటన చేశాడు.
North Korea Missiles: అణ్వస్త్ర దేశంగా అవతరించినప్పటి నుంచి ఉత్తర కొరియాతో యుద్ధం చేస్తున్న దక్షిణ కొరియా- అమెరికాల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా, దక్షిణ కొరియా రక్షణ సహకారాన్ని పెంచుకుంటున్నాయి. ఇందుకోసం సైనిక కసరత్తులు చేస్తున్నారు. అదే సమయంలో, 27 వేల మంది అమెరికన్ సైనికులు దక్షిణ కొరియాలో మోహరించారు.
అణు, బాలిస్టిక్ ఆయుధాల పరీక్షలకు సంబంధించి ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. సరళంగా చెప్పాలంటే, ఈ ఆంక్షల ప్రకారం ఉత్తర కొరియా అణు- బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించకూడదు. అయినప్పటికీ అది నిరంతరం క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ వస్తోంది.