గూగుల్ మ్యాప్స్ స్థానంలో రాబోతున్నా ఓలా మ్యాప్స్!

గూగుల్ మ్యాప్స్ నుంచి వైదొలిగిన ఓలా త్వరలో తన ఓలా మ్యాప్స్ తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం గూగుల్ మ్యాప్స్ కు 100 కోట్లకు పైగా ఖర్చుపెట్టటమే అని తెలుస్తోంది. ఇటీవలె ఓలా కంపెనీ సీఈవో అగర్వాల్ తన ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని తెలియజేశారు.

New Update
గూగుల్ మ్యాప్స్ స్థానంలో రాబోతున్నా ఓలా మ్యాప్స్!

గూగుల్ మ్యాప్స్ కోసం ఏటా రూ.100 కోట్లను ఖర్చు పెడుతుండటంతో దాని నుంచి భయటకు వచ్చి సొంతంగా ఓలా మ్యాప్ తో రావాలని కంపెనీ యోచిస్తుంది. ఇపుడు సొంత మ్యాప్స్ కారణంగా మా ఖర్చు సున్నాకు చేరింది' అని అగర్వాల్ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. స్ట్రీట్ వ్యూ, ఇండోర్ ఇమేజెస్, త్రీడీ మ్యాప్స్, డ్రోన్ మ్యాప్స్ తదితర ఫీచర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.

ఓలా ఎలక్ట్రిక్ సొంతంగా సాలిడ్ స్టేట్ బ్యాటరీలనూ తయారు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఓలా విద్యుత్ స్కూటర్లకు ఈ బ్యాటరీలనే వినియోగించనుంది. 2021 అక్టోబరులో పుణేకు చెందిన జియోస్పేషియల్ సర్వీస్ ప్రొవైడర్ అయిన జియోస్పోక్‌ను ఓలా కొనుగోలు చేసింది. గత నెలలో అగర్వాల్.. మైక్రోసాఫ్ట్ అజూర్‌తో వ్యాపార సంబంధాలు ముగించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు