Fearless Animal. భయమంటే ఏంటో ఎరుగని జంతువు భయంలేని వారు ఎవరూ ఉండరు. మనుషులు, జంతువులు అందరూ దేనికో దానికి...ఎక్కడో ఒక చోట భయపడతారు అంటారు. అయితే జంతువుల్లో సింహాలు, పులులు, ఏనుగులకు అస్సలు భయం ఉండదు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే..ఇలాంటి భయంలేని జంతువు మరొకటి ఉంది. అదే భనీ బ్యాడ్జర్. By Manogna alamuru 19 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Honey Badger: సింహాలు గర్జిస్తే అందరూ దడుసుకుంటారు. పులిని చూస్తేనే చాలామంది భయపడతారు. గజరాజు ఘీంకరిస్తే ఆ శబ్దానికే గజాగజా వణికిపోతారు. ఈ మూడు జంతువులకు అసలు భయమే ఉండదంటారు. అందుకే మన తెలుగు హీరోలు కూడా ఎక్కువగా పులులు, సింహాలతోనే కంపేర్ చేసుకుంటారు. ఇక ఈ జంతువులకు భయం లేదన్నది నిజమే కావొచ్చు.. కానీ మేటర్ ఏంటంటే..కేవలం ఈ మూడు క్రూర మృగాలకే కాదు.. భయానికే మీనింగ్ తెలియని మరో యనిమల్ కూడా అడవుల్లో ఉంటుంది. అదే హనీ బ్యాడ్జర్. అడవిలో అత్యంత ధైర్యం కలిగి జంతువు ఇదే..! హనీ బ్యాడ్జర్ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ తెలివి, ధైర్యం విషయంలో దీన్ని మించిన జంతువు ఈ భూమిపై మరొకటి లేదు. ఈ ప్రెడేటర్ దూకుడుకు మారుపేరు. హనీ బ్యాడ్జర్‌కు ప్రపంచంలోని మోస్ట్ ఫియర్‌లెస్ యానిమల్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. పులులు, సింహాలు, హైనాలు లాంటి పెద్ద, వేటాడే జంతువులను కూడా హనీ బ్యాడ్జర్ ఎదుర్కోగలదు. అంతేకాదు మట్టికరిపించగలదు కూడా! హనీ బ్యాడ్జర్స్ చాలా క్రూరమైనవి, తెలివైనవి. పదునైన దంతాలు, గోర్లతో ఇతర జంతువులపై భయంకరంగా దాడి చేస్తాయి. అద్భుతమైన రక్షణ నైపుణ్యాలు ఉన్నప్పటికీ, ఇవి అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి. ఇవి ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్‌తో పాటు పశ్చిమ ఆసియా దేశాల్లో నివసిస్తాయి. సౌత్ ఆఫ్రికన్ కంట్రీ లైఫ్ రిపోర్ట్ ప్రకారం.. హనీ బ్యాడ్జర్ల శరీర నిర్మాణం ఇతర జంతువుల దాడి నుంచి రక్షణ పొందేలా ఉంటుంది. పదునైన పంజాలు, దట్టమైన చర్మంతో పాటు చాలా బలమైన దవడలు వీటి సొంతం. అందుకే ఇవి ఏమాత్రం భయపడకుండా తమపైకి దూసుకొచ్చే పెద్ద జంతువులపై తిరిగి దాడి చేస్తాయి. వాటిని భయపెట్టి, తమను తాము రక్షించుకుంటాయి. Also Read:Karnataka: రైతును అవమానించిన షాపింగ్ మాల్ – ఏడు రోజులు క్లోజ్ #animal #honey-badger #fearless మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి