బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు.. తరుణ్‌ చుగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, తెలుగు మీడియాలో ప్రసారమవుతున్న న్యూస్ వివరాలు తమ దృష్టికి వచ్చాయని, కానీ అలాంటి మార్పులేవీ ఉండవని స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిని మార్చనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అలాంటి ప్రతిపాదనగానీ, ఆలోచనలుగానీ, చర్చలు గానీ లేవని క్లారిటీ ఇచ్చిన తరుణ్‌చుగ్.

New Update
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు.. తరుణ్‌ చుగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

No change in postsTarunchug Clarity

వార్తల్లో నిజం లేదు..

రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉన్న బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గత కొంతకాలంలో స్టేట్ చీఫ్‌ను మార్చడంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిషన్‌రెడ్డిని కేంద్ర క్యాబినెట్ నుంచి తప్పించి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇప్పుడు ప్రెసిడెంట్‌గా ఉన్న బండి సంజయ్ యధావిధిగా కంటిన్యూ అవుతారని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ క్లారిటీ ఇచ్చారు.

ఎవరి పధవుల్లో వారే

రాష్ట్ర బీజేపీలో అసమ్మతి, అసంతృప్తి నెలకొన్న సమయంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి కొద్దిమందిని అధిష్టానం ఢిల్లీ పిలిపించుకుని ఇటీవల చర్చలు జరిపింది. దానికి కొనసాగింపుగా బండి సంజయ్‌ను కూడా రెండు రోజుల క్రితం పిలిచి మాట్లాడింది. దీంతో స్టేట్ చీఫ్ బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించి కిషన్‌రెడ్డికి అప్పగించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

అధిష్టానం ఏం చెప్పలేదు

ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్‌రెడ్డి అభిప్రాయాన్ని కూడా హైకమాండ్ తీసుకున్నదని, ఆయనను కన్విన్స్ చేసిన తర్వాతనే మార్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయం బండి సంజయ్‌తోనూ ప్రస్తావించగా, ఇప్పటివరకు తనకు అధిష్టానం నుంచి అలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సైతం అధ్యక్షుడి మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు