Gold Rates : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. బంగారం పరుగులకు బ్రేక్.. కాస్త తగ్గిన వెండి!

వరుసగా పెరుగుతూ హడలెత్తించిన బంగారం ధరలు రెండురోజులుగా నిలకడగా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,270ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి  రూ.79,000 వద్ద ఉంది.

New Update
Gold Rates : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. బంగారం పరుగులకు బ్రేక్.. కాస్త తగ్గిన వెండి!

Gold Rates Today : నెల ప్రారంభం నుంచి మోత మోగించిన బంగారం ధరలు ఎట్టకేలకు పసిడి ప్రియులకు కాస్త ఊపిరి తీసుకునే వెసులుబాటు ఇచ్చాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు యధాతథంగా మార్పులు లేకుండా నిలిచాయి. బంగారం ధరలు స్థిరంగా ఉంటే, వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుదల కనబరిచాయి. దీంతో బంగారం, వెండి ధరలు అందుబాటులోకి వస్తాయని గోల్డ్ లవర్స్ సంబరపడుతున్నారు. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించిన ఉత్సాహం, యూఎస్ ఫెడ్ రేట్లు తగ్గిస్తారనే వార్తల నేపథ్యంలో ఈ నెలలో వరుసగా  బంగారం ధరలు పైపైకి ఎగసినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈరోజు అంటే మార్చి12న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rates) నిలకడగా ఉంది.   మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.  ఈరోజు అంటే మంగళవారం (మార్చి12) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rates) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                          

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు రెండోరోజు కూడా నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rates) రూ.60,750ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.66,270ల వద్ద స్థిరంగా ఉంది.  

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) స్థిరంగా ఉన్నాయి.  ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold Rates) రూ.60,900ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,420లుగా మార్పులు లేకుండా ఉంది.   

Also Read : గత వారమంతా మోత మోగించిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rates Today)పెరుగుదల మధ్యలో వెండి కూడా పెరుగుతూ వచ్చింది. అయితే, ఈరోజు వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనబడింది.  హైదరాబాద్ లో వెండి కేజీకి 100 రూపాయలు తగ్గి రూ.79,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 200 రూపాయలు తగ్గి రూ. 75,500ల వద్దకు దిగి వచ్చింది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.  దీంతో ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rates Today)  2178.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర నిలకడగా (Gold And Silver Price) ఔన్స్ 24.31డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

Advertisment
తాజా కథనాలు