Gold Price : అవే రేట్లు.. మార్పులేదు.. బంగారం కొనాలంటే ట్రై చేయొచ్చు 

బంగారం వరుసగా రెండోరోజూ (డిసెంబర్ 26) స్థిరంగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,200ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,490ల వద్ద మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.80,700ల వద్దకు చేరుకుంది. 

New Update
Gold Price : అవే రేట్లు.. మార్పులేదు.. బంగారం కొనాలంటే ట్రై చేయొచ్చు 

Gold Rates : వరుస పెరుగుదల నుంచి కాస్త ఊపిరి తీసుకునేలా చేస్తోంది బంగారం. వరుసగా రెండోరోజు కూడా బంగారం ధరలు యథాతథంగా ఉన్నాయి. ఈ నెల మొత్తంలో బంగారం రేట్లు అస్థిరంగా కదిలాయి. అయినా రికార్డు స్థాయిలోనే ధరలు ఉంటూ వచ్చాయి. ఇప్పుడు కూడా బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ.. పై స్థాయిలోనే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే, తప్పనిసరిగా బంగారం కొనాలనుకునే వారికి కదలిక లేకుండా బంగారం ధరలు ఉండడం కాస్త కలిసొచ్చే అంశమే. ఈరోజు అంటే డిసెంబర్ 26న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరల్లో(Gold Price) పెద్దగా మార్పు లేకపోవడంతో దేశీయంగాను బంగారం ధరలు స్థిరంగా నిలిచాయి. మరోవైపు వెండి ధరలు కూడా నిన్నటి ధరల వద్దే మార్పులు లేకుండా నిలిచాయి. ఈరోజు అంటే సోమవారం(డిసెంబర్ 25) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.  

హైదరాబాద్(Hyderabad) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price) ఎటువంటి మార్పు లేకుండా రూ.58,200ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం కూడా స్థిరంగా నిలిచింది. నిన్నటి ధర రూ. 63,490ల వద్ద మార్పులు లేకుండా ఉంది.  అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి.  ఇక్కడ 22 క్యారెట్ల బంగారం రూ.58,350ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) కూడా నిన్నటి ధర రూ.63,640ల వద్ద స్థిరంగా ఉంది. 

ఇక వెండి ధరలు మాత్రం ఈరోజు కాస్త పెరుగుదల కనబరిచాయి. బంగారం(Gold Price) స్థిరంగా ఉన్నప్పటికీ, వెండి ధరలు మాత్రం కేజీకి 200 రూపాయలు పెరిగాయి. దీంతో  హైదరాబాద్ లో వెండి కేజీకి  రూ.80,700ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు కేజీకి 200 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ.79,200లుగా ఉంది.  

Also Read: షాకిస్తున్న బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు తులం ఎంతంటే?

అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు(Gold Price)ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate Today)  2055 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Silver Rate) ఔన్స్ 24.24 డాలర్లుగా ఉంది. మొత్తమ్మీద చూస్తే ఈరోజు బంగారం వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేవని చెప్పవచ్చు. 

గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు