శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ
నిజామామబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాడ్ గ్రామంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఈ సీజన్‌లో ఎగువ ప్రాంతంలో వరద ఉదృతంగా ప్రవహిస్తుంది.ఎగువన కురిసిన వర్షపు నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతాయి. అయితే ప్రస్తుత సీజన్‌లో సకాలంలో వరదలు రావడంతో జూలైలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 1065 అడుగులు నిండింది. ఎగువన కురిసిన వర్షపు నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతాయి. అయితే ప్రస్తుత సీజన్‌లో సకాలంలో వరదలు రావడంతో జూలైలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు వచ్చి చేరింది.
అయితే శ్రీరాంసాగర్‌లోకి ప్రాజెక్టులో ప్రస్తుతం 21.741 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 5114 క్యూసెక్కులు కొనసాగుతున్నది. ఔట్ ఫ్లో 1199 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 ఉండగా ప్రస్తుతం 1065 అడుగులు ఉంది. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 90 టీఎంసీలు, గతేడాది ఇదే రోజు 1087.60 అడుగుల నీరు వచ్చి చేరిందని అధికాలు తెలిపారు. ప్రస్తుతం 75.146 టీఎంసీలు ఉనట్లు తెలిపారు.
సాగునీరు..తాగునీరు ఇబ్బందిలేదు..
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకుగాను ప్రస్తుతం 1065 అడుగులు ఆడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు సామర్ద్యం 91 టీఎంసీలకు గాను 21.741టీఎంసీల నీరు ఉంది. వస్తున్న వరదకు ఆనుగూణంగానే ప్రాజెక్టు అధికారులు నీటిని గోదవరిలోకి విడదల త్వరలో నిర్ణయిస్తారు. అయితే ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాజెక్టు ఎప్పుడూ ఆగస్టులో నిండుతూ వచ్చేది. కానీ ఈ ఏడాది మాత్రం జులై రెండో వారంలోనే భారీ వరద నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయం నిండిపోయింది. ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సాగు నీరు.. ఉమ్మడి నాలుగు జిల్లాలకు తాగు నీరు అందించవొచ్చు అంటున్నారు అధికారులు.