Dharmapuri arvind on rahul gandhi speech and nama nageswar rao: లోక్సభలో రాహుల్ గాంధీ స్పీచ్ వినలేకపోయానంటూ చురకలంటించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించిన విషయం తెలిసిందే. రాహుల్ స్పీచ్పై అరవింద్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ స్పీచ్ విందాం అనే అనుకున్నానని.. సగం కంటే ఎక్కువ వినలేకపోయానన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థంకాలేదన్నారు అరవింద్. నా బుర్రకి ఆయన చెప్పింది ప్రాసెస్ కాలేదంటూ కౌంటర్లు వేశారు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు.. ఏం మాట్లాడుతున్నాడు.. నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఆయన మాట్లాడిన దానికి సంబంధం ఏంటన్నది తెలియడంలేదన్నాడు. తనది వన్ ఆఫ్ ది స్మార్ట్ బుర్ర అని.. తనకే ఎక్కలేదంటే ఇంకా సామాన్యూలకు ఎలా ఎక్కుతుందని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..నాది స్మార్ట్ బుర్ర.. రాహుల్ ఏం చెప్పిండో తనకే అర్థం కాలేదంటూ అరవింద్ చురకలు
రాహుల్ స్పీచ్పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ స్పీచ్ అసలేం అర్థంకాలేదన్నారు. లోక్సభలో రాహుల్ ఏం మాట్లాడారో తన స్మార్ట్ బుర్రకే అర్థంకాలేదని.. ఇక కామన్మ్యాన్కి ఏం అర్థం అవుతుందంటూ కౌంటర్లు వేశారు.
Translate this News: