Nitish Kumar: 9వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

తొమ్మిదోసారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌లో ఆయనతో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఇద్దరు బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Nitish Kumar: 9వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
New Update

Nitish Kumar: బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇండియా కూటమికి బై చెప్పి కాషాయ పార్టీకి హాయ్ చెప్పారు నితీష్ కుమార్ . 9వ సారి బీహార్‌ సీఎంగా నితీష్‌కుమార్‌ ప్రమాణం స్వీకారం చేశారు. నితీష్‌తో ప్రమాణం చేయించారు గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌. నితీష్‌తో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు.. హెచ్‌ఎఎం నుంచి ఒకరు, ఒక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు.

ALSO READ: కేసీఆర్ చాలా డేంజర్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు లభించాయి. బీజేపీ నుంచి మంత్రులుగా సామ్రాట్‌ చౌదరి.. విజయ్‌కుమార్‌ సిన్హా, డాక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ ప్రమాణం చేశారు. సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ కుమార్‌ సిన్హాకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభించాయి. జేడీయూ నుంచి విజయ్‌ చౌదరి, విజేంద్ర యాదవ్‌, శ్రవణ్‌ కుమార్‌ ప్రమాణం చేశారు. హెచ్‌ఎఎం నుంచి మంత్రిగా ప్రమాణం చేశారు సంతోష్‌ సుమన్‌. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే సుమిత్‌ సింగ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది.

2000 నుంచి ఇప్పటివరకు 9వ సారి సీఎంగా నితీష్‌ ప్రమాణం చేశారు. ఎక్కువ సార్లు సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తిగా నితీష్‌ భారత చరిత్రలో నిలిచారు. 2000లో వారం రోజులు సీఎంగా పని చేశారు నితీష్‌.. ఆ తర్వాత నుంచి కూటములు మారుస్తూ.. సీఎంగా ఉంటూ వస్తున్నారు నితీష్‌ కుమార్‌.

ALSO READ: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో కీలక పరిణామం

DO WATCH: 

#bihar-news #nitish-kumar #bihar-cm
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి