/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/NITISH-KUMAR-1-2-jpg.webp)
Nitish Kumar: బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇండియా కూటమికి బై చెప్పి కాషాయ పార్టీకి హాయ్ చెప్పారు నితీష్ కుమార్ . 9వ సారి బీహార్ సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణం స్వీకారం చేశారు. నితీష్‌తో ప్రమాణం చేయించారు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. నితీష్‌తో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు.. హెచ్‌ఎఎం నుంచి ఒకరు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు.
A total of 8 leaders took oath as cabinet ministers in the new government led by Nitish Kumar.
Three from BJP – Samrat Choudhary, Vijay Kumar Sinha, Prem Kumar. Three from JDU – Vijay Kumar Choudhary, Bijendra Prasad Yadav, Shrawon Kumar and Hindustani Awam Morcha (Secular)… pic.twitter.com/CTEezzqpEb
— ANI (@ANI) January 28, 2024
ALSO READ: కేసీఆర్ చాలా డేంజర్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు లభించాయి. బీజేపీ నుంచి మంత్రులుగా సామ్రాట్ చౌదరి.. విజయ్‌కుమార్ సిన్హా, డాక్టర్ ప్రేమ్ కుమార్ ప్రమాణం చేశారు. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభించాయి. జేడీయూ నుంచి విజయ్ చౌదరి, విజేంద్ర యాదవ్, శ్రవణ్ కుమార్ ప్రమాణం చేశారు. హెచ్‌ఎఎం నుంచి మంత్రిగా ప్రమాణం చేశారు సంతోష్ సుమన్. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సుమిత్ సింగ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది.
2000 నుంచి ఇప్పటివరకు 9వ సారి సీఎంగా నితీష్ ప్రమాణం చేశారు. ఎక్కువ సార్లు సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తిగా నితీష్ భారత చరిత్రలో నిలిచారు. 2000లో వారం రోజులు సీఎంగా పని చేశారు నితీష్.. ఆ తర్వాత నుంచి కూటములు మారుస్తూ.. సీఎంగా ఉంటూ వస్తున్నారు నితీష్ కుమార్.
PM Narendra Modi congratulates Nitish Kumar, Samrat Choudhary and Vijay Sinha on taking oath as CM, Deputy Chief Ministers of Bihar
"The NDA government formed in Bihar will leave no stone unturned for the development of the state and to fulfil the aspirations of its… pic.twitter.com/jLjB8hJOh3
— ANI (@ANI) January 28, 2024
ALSO READ: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో కీలక పరిణామం
DO WATCH: