Nita Ambani: స్త్రీ గొప్పతనాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టించిన నీతా అంబానీ.. వీడియో వైరల్!

అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు. వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందన్నారు నీతా అంబానీ. అనంత్‌-రాధికా ‘కన్యాదానం’ ప్రాశస్త్యాన్ని ఆమె ఉద్వేగభరితంగా వర్ణించారు. కూతురు ఆస్తి కాదని, ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదమంటూ అతిథులను భావోద్వేగానికి గురిచేశారు.

Nita Ambani: స్త్రీ గొప్పతనాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టించిన నీతా అంబానీ.. వీడియో వైరల్!
New Update

Ambani Wedding: ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని మన పవిత్ర గ్రంథాలు నేర్పించినట్లు ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ అన్నారు. అమ్మాయిలు మన ఇళ్లను స్వర్గంగా మారుస్తారు. కుమార్తెలకు దేవుడిచ్చిన శక్తి ఎక్కువ అంటూ స్త్రీ గురించి గొప్పగా వర్ణించారు. ఈ మేరకు వారి చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ వేడుకలో ‘కన్యాదానం’ ప్రాశస్త్యాన్ని ఆమె ఉద్వేగభరితంగా వర్ణించారు. ప్రస్తుతం నీతా మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా ఆడపిల్లల తల్లదండ్రులు భావోద్వేగానికి లోనవుతున్నారు.

ఆడపిల్లలు ఆస్తి కాదు..

‘అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు. ఏ తల్లిదండ్రులైనా వారిని వేరే ఇంటికి పంపించాలని కోరుకోరు. హిందూ సంప్రదాయంలో కన్యాదానం అనేది చాలా గొప్పది. కానీ ఓ కుమార్తె కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో పంచుకున్న అనుబంధాన్ని, ఆప్యాయత నుంచి ఎలా దూరం కాగలదు? పుట్టింటి బంధం శాశ్వతంగా ఉంటుంది. కూతురు ఆస్తి కాదు ఒకరికి బదిలీ చేయడానికి! ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం. కుటుంబంలోని ప్రేమ, ఆనందం, వెలుగుకు మూలం. పెళ్లి అనే బంధంతో ఇప్పుడామె ఇవన్నీ కొత్త కుటుంబంతోనూ పంచుకుంటుంది. మన సంస్కృతీ సంప్రదాయాలు స్త్రీలకు అత్యంత గౌరవం ఇచ్చాయి. ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని మన పవిత్ర గ్రంథాలు నేర్పించాయన్నారు.

అలాగే కుమార్తెలకు దేవుడిచ్చిన శక్తి ఎక్కువ. అమ్మాయిలు మన ఇళ్లను స్వర్గంగా మారుస్తారు. వివాహ బంధం అనేది.. వధూవరుల మధ్య, వారి కుటుంబాల మధ్య సంపూర్ణ సమానత్వమనే పునాదిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, కన్యాదానానికి నిజమైన అర్థం ఏంటంటే.. వధువు తల్లిదండ్రులు వరుడిని తమ కుమారుడిగా అంగీకరించడం.. అమూల్యమైన తన కుమార్తెను అతడి కుమారుడి చేతుల్లో పెట్టడం. నేను కూడా ఓ కుమార్తెనే. ఒక అమ్మాయికి తల్లిని, అత్తను కూడా. ఆడపిల్లలు లక్ష్మీ స్వరూపులు. వారు పుట్టగానే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కుటుంబాలు సంతోషమనే వెలుగులతో విరాజిల్లుతాయి' అంటూ అద్భుతంగా వివరించారు.

#nita-ambani #women-power #ananth-radhika-wedding
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe