Nipah Virus: వణికిస్తున్న నిపా వైరస్..ఇద్దరు మృతి! స్తుతం నిపా వైరస్ కేరళ రాష్ట్రంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. దీంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించడంతో కోజికోడ్ జిల్లాలో హెల్త్ అలర్ట్ ప్రకటించింది. By Bhavana 12 Sep 2023 in నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి Nipah Virus in Kerala: ఇప్పటి వరకు ప్రపంచాన్ని కరోనా (Corona) వణికించింది. ఇంకా చాలా మంది కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు జ్ఙాపకాల నుంచి బయటకు రాలేదు. కొవిడ్ (Covid) వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నో వ్యాపారాలు నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి కొంచెం తెరుకుంటున్న సమయంలో మరో మహమ్మారి నేను ఉన్నాను అంటుంది. అదే నిపా వైరస్ (Nipah Virus)..ప్రస్తుతం నిపా వైరస్ కేరళ రాష్ట్రంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. దీంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించడంతో కోజికోడ్ జిల్లాలో హెల్త్ అలర్ట్ ప్రకటించింది. నిపా వైరస్ మరణాల గురించి కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Veena George) వెంటనే ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తులు నిపా వైరస్ వల్లే మరణించారని వైద్యాధికారులు భావిస్తున్నారు. చనిపోయిన వారిలో ఒకరి బంధువు కూడా ఐసీయూలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే 2018, 2021 సంవత్సరాల్లో కూడా కోజికోడ్ జిల్లాలోనే నిపా వైరస్ కారణంగా కొందరు మరణించారు. 2021లోనూ మెదడు వాపు వ్యాధితో చనిపోయిన బాలుడిలో నిపా వైరస్ ను గుర్తించారు. 1989లో ప్రపంచంలో తొలిసారి నిపా వైరస్ ను మలేషియాలో గుర్తించారు. కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ మొదటి కేసు 2018 మే లో కోజికోడ్ (Kozhikode)లోనే నమోదైంది. నిపా వైరస్ అనేది ముఖ్యంగా జంతువుల నుంచి ప్రజలకు సంక్రమించే వ్యాధి. ముఖ్యంగా ఇది పందుల ద్వారా వ్యాప్తి చెందుతోందని అధికారులు గుర్తించారు. ఈ వైరస్ ప్రజలకు సోకితే వారిలోని శ్వాసకోశ ఇబ్బందులు పడి మరణానికి దగ్గర అవుతున్నారు. నిపా వైరస్ వట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. Also Read: పెరుగుతున్న ఇన్‌ఫ్లుఎంజా ఎ, స్వైన్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్లు..మాస్క్ తప్పనిసరి అంటున్న వైద్యులు..!! #kerala #nipah-virus-in-kerala #nipah-virus-disease #nipah-alert #nipah-virus-niv #nipah-virus-symptoms #nipah-virus-kerala-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి