Niharika Konidela : పిల్లల కోసం పెళ్లి చేసుకుంటాను : మెగా డాటర్!

మెగా డాటర్ నిహారిక తనకు పిల్లలంటే చాలా ఇష్టమని వారు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అందుకే రెండో పెళ్లి చేసుకుంటానని.. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట్లో వైరల్‌ గా మారాయి.

New Update
Niharika : ఈ పోస్ట్‌ కి అర్థం ఏంటి.. నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా?

Niharika : మెగా కుటుంబం(Mega Family) నుంచి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన కొణిదెల నిహారిక(Niharika) ఇండస్ట్రీలో పెద్దగా క్లిక్ కాలేకపోయింది. దీంతో ఆమె నిర్మాత(Producer) గా మారి వెబ్‌ సిరీస్‌ లు తీయడం ప్రారంభించింది. ఆ తరువాత కొంత కాలానికే సినిమాలు వదిలి పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి అయిన మూడు సంవత్సరాలకే విడాకులు(Divorce) తీసుకుని పుట్టింటికి చేరింది.

విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని అయితే క్లారిటీగా చెప్పలేదు కానీ విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ తరువాత ఆమె చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఆ సమయంలో పెళ్లి గురించి చెప్పిన మాటలు కొన్ని వైరల్‌ అవ్వడం వాటికి మాజీ భర్త నిహారిక పేరు తీయకుండా కౌంటర్లు ఇవ్వడం కూడా జరిగింది.

ఈ క్రమంలో మరోసారి నిహారిక అన్న మాటలు సోషల్‌ మీడియా(Social Media) లో వైరల్‌ గా మారాయి. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని వారు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అందుకే రెండో పెళ్లి చేసుకుంటానని.. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట్లో వైరల్‌ గా మారాయి.

అయితే నిహారిక ఇలా ఈ వ్యాఖ్యలు చేసిందో లేదో ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda)  మరోసారి తన ఇన్‌ స్టా(Insta లో ఓ సుదీర్ఘమైన కవితను రాసుకొచ్చాడు. ‘‘విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం. నీటి అడుగున ఉన్నప్పుడు అనుభవించే నిశ్శబ్దం, జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలో మీరు కోరుకునే నిశ్శబ్దం. చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించే నిశ్శబ్దం, మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం. మీ ప్రాణశక్తిని ప్రకృతి శక్తి నుండి వేరు చేస్తుంది. చప్పట్లు కొట్టే ముందు ప్రదర్శన ముగింపులో ఉండే నిశ్శబ్దం. భౌతిక రూపం నుంచి విముక్తి పొందండి. ఇదే మౌనం భగవంతుడితో కలిపే మాధ్యమం’ అంటూ ఓ కవిత లాంటిది రాసుకొచ్చాడు.

ఈ కవిత ను చూసిన నెటిజన్లు ఆ పోస్ట్ నిహారిక కోసమే పెట్టాడు అంటూ రాసుకోస్తున్నారు. ఆమెను మర్చిపోలేకే ఆమె రెండో పెళ్లి చేసుకుంటాను అంటే తట్టుకోలేక ఇలా తన విరహాన్ని వ్యక్తం చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read : 12: 55కు ముహూర్తం ఫిక్స్.. మరికాసేపట్లో వైసీపీ జాబితా!

Advertisment
Advertisment
తాజా కథనాలు