బర్త్ డే స్పెషల్ ట్రీట్ ఇచ్చిన మెగా డాటర్.. చాలా హాట్ అంటున్న కుర్రాళ్లు

మెగా డాటర్ నిహారిక బర్త్ డే సందర్భంగా 'What The Fish' మూవీనుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. డాలర్‌ బ్యాక్‌డ్రాప్‌లో మెస్మరైజింగ్‌ వాక్‌తో నడిచొస్తున్న ఆమె లుక్ రిలీజ్ చేశారు. షార్ట్ వైట్ గౌనులో నటి బ్యూటిఫుల్ గా కనిపించగా ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.

బర్త్ డే స్పెషల్ ట్రీట్ ఇచ్చిన మెగా డాటర్.. చాలా హాట్ అంటున్న కుర్రాళ్లు
New Update

మెగా డాటర్, నటి నిహారిక తన అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. ఇటీవల పెళ్లి, విడాకుల ఇష్యూతో తరచూ వార్తల్లో నిలిచిన ఆమె.. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా తన బర్త్ డే సందర్భంగా ఈ మూవీనుంచి తన ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియోలో షేర్ చేసింది. వైట్ అండ్ వైట్ షార్ట్ గౌనులో నటి బ్యూటిఫుల్ గా కనిపించగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ మేరకు 'What The Fish' మనం మనం బరంపురం.. అనే ట్యాగ్ లైన్ తో వరుణ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా డార్క్‌ కామెడీ-హై ఆక్టేన్‌ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల ఈ సినిమాలో కీ రోల్‌లో నటిస్తుండగా.. ఆమె పుట్టిన రోజు సందర్భంగా డాలర్‌ బ్యాక్‌డ్రాప్‌లో మెస్మరైజింగ్‌ వాక్‌తో వస్తున్న విజువల్స్‌ రిలీజ్ చేశారు. అంతేకాదు దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మేకర్స్.. 'Team #WhatTheFish welcomes the R̶i̶c̶h̶e̶s̶t̶ Ravishing beauty @IamNiharikaK aboard & wishes a very Happy Birthday' అటూ పోస్టుకు క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె గ్లామర్ లుక్స్ వైరల్ అవుతుండగా కొంతమంది తెగ పొగిడేస్తుంటే మరికొందరు మాత్రం నెగెటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. బోల్డ్ యాంగిల్స్ ను ఉద్దేశిస్తూ చాలా హాట్ అంటూ  ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : పార్లమెంట్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌ స్పెషల్ ఫోకస్‌.. నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు వీళ్లే

ఇక ఇదిలావుంటే.. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్న సినిమాను ఉద్దేశిస్తూ ఇటీవల మంచు మనోజ్ ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నాడు. ‘నేను సినిమా చేసి చాలా రోజులైంది.. కానీ ఇన్నాళ్లూ నేను మీ అందరి ప్రేమను కలిగి ఉండేలా ఆశీర్వదించబడ్డాను. మీ ప్రేమను తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇదిగో నా కొత్త సినిమా ప్రకటిస్తున్నా. మీ అందరికీ క్రేజీ అనుభవాన్ని అందించే క్రేజీ సినిమా WhatThe Fish’ అంటూ ఇప్పటికే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పాడు మనోజ్. మంచు మనోజ్‌ మరోవైపు ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌తో సినిమా కూడా చేస్తున్నాడు.

#birthday #what-the-fish #niharika
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe