Niharika Konidela : బాబాయి పై ప్రేమతో ఆ పని చేస్తున్న నిహారిక.. మెగా డాటర్ ప్లానింగ్ మాములుగా లేదుగా

మెగా డాటర్ నిహారిక ‘కమిటీ కుర్రోళ్ళు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జనసేన పార్టీ గెలుపొందిన నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్‌ వేయాలని ఆమె నిర్ణయించుకున్నారట. బాబాయి పై ప్రేమతోనే నిహారిక ఈ పని చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Niharika Konidela : బాబాయి పై ప్రేమతో ఆ పని చేస్తున్న నిహారిక.. మెగా డాటర్ ప్లానింగ్ మాములుగా లేదుగా
New Update

Niharika Konidela : తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన మెగా డాటర్ నిహారిక కొణిదెల తన లేటెస్ట్ మూవీ 'కమిటీ కుర్రాళ్ళు' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీమియర్లను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్న నిహారిక, జనసేన పార్టీ గెలిచిన ప్రాంతాల్లో ప్రీమియర్లను నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.

దాదాపు 16మంది నూతన నటీనటులతో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్ళు' సినిమాను నిహారిక స్వయంగా నిర్మించారు. ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిహారిక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జనసేన పార్టీ గెలుపొందిన నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్‌ వేయాలని ఆమె నిర్ణయించుకున్నారని చిత్రవర్గాల సమాచారం.

Also Read : విజయ్ లుక్ చూస్తే షాకే..! ‘VD12’ ఫస్ట్ లుక్ పోస్టర్

తన బాబాయి పై ప్రేమతో నిహారిక తన కొత్త సినిమా ప్రీమియర్లను జనసేన పార్టీకి బూస్ట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. కాగా నిహారిక తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. గోదావరి జిల్లా నేపథ్యంలో సాగే ఈ చిత్రం, కాలేజీ కుర్రాళ్ళ కథను ఆధారంగా చేసుకుని ఉంటుంది. కామెడీ, ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమాను యదు వంశీ డైరెక్ట్ చేశారు.

#committe-kurrollu-movie #niharika-konidela
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe