Night Shift : నైట్‌ షిప్ట్‌లు ఎక్కువగా చేసేవారు ఇవి తింటే మంచిది

నైట్‌షిప్ట్‌కి వెళ్లేవారు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకలిగా అనిపిస్తే పండ్లు, వేరుశెనగ, జీడిపప్పు, బాదం వంటి గింజలు తినవచ్చు. దీన్ని 30 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. ఇక నైట్‌షిఫ్ట్‌ సమయంలో కూల్‌ డ్రింక్స్‌ అసలు తాగకూడదు.

New Update
Night Shift : నైట్‌ షిప్ట్‌లు ఎక్కువగా చేసేవారు ఇవి తింటే మంచిది

Night Shift Duties : ప్రకృతి నియమం ప్రకారం ఉదయం నిద్రలేచి(Morning Wakeup) రోజువారీ పనిని సాయంత్రంలోగా ముగించి రాత్రి నిద్రపోయి(Night Sleep) శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం ఉత్తమ జీవన విధానం. చాలా మంది ఎక్కువగా నైట్‌ షిప్ట్‌(Night Shifts) లు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

నైట్‌ షిప్ట్‌ల వల్ల నష్టాలు:

రాత్రి షిఫ్టులో పనిచేసేవారిలో ఆరోగ్య సమస్యలు(Health Problems) ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇతర వ్యక్తుల కంటే రాత్రిపూట పని చేసేవారిలో ఊబకాయం వచ్చే అవకాశం 25 శాతం ఎక్కువ. రొటేటింగ్ ప్రాతిపదికన రాత్రి షిఫ్టులు చేసేవారు, రాత్రిపూట మాత్రమే పనిచేసేవారు ఊబకాయానికి గురవుతారు. చాలా కంపెనీల్లో రొటేషన్ వర్క్ పేరుతో సోమవారం ఒక షిఫ్టు, శుక్రవారం వరకు ఒక షిఫ్టు, శనివారం రాత్రికి షిఫ్ట్ చేసి ఆదివారం సెలవు ఇస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. రాత్రిపూట పనిచేసే వారి శరీరంలో కూడా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

నైట్‌షిప్ట్‌ చేసేవారు చేసే పొరపాట్లు:

నైట్‌ షిప్ట్‌లలో పనిచేసేవారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారపు అలవాట్లను మార్చుకోవచ్చు. సాధారణంగాతిన్న తర్వాత నిద్రపోము. తొమ్మిదికి తింటే పదికి పడుకుంటాం. మళ్లీ ఉదయం ఎనిమిది గంటలకు తింటాం. ఈ మధ్యలో కడుపు 11 గంటలు ఖాళీగా ఉంటుంది. నైట్‌షిప్ట్‌కు వెళ్తే ఎనిమిది గంటలకు టిఫిన్‌, పది గంటలకు టీ లేదా కాఫీ, 12 గంటలకు లేదా ఒంటిగంటకు టీ, కాఫీతో కొన్ని స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం. ఇంటికి వెళ్లిన తర్వాత ఎనిమిది గంటలకు అల్పాహారం తీసుకుంటాం. నైట్‌షిప్ట్‌లో ఉంటే ఏదోకటి తింటూ ఉంటారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

ఇలా ప్లాన్‌ చేసుకోండి:

నైట్‌షిప్ట్‌కి వెళ్తే 7 గంటల కల్లా తినాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపు నిండటంతో పాటు ప్రొటీన్లు అందుతాయి. ఆకలిగా అనిపిస్తే 10 గంటలకు తక్కువ తియ్యని పండ్లు, వేరుశెనగ, జీడిపప్పు, బాదం వంటి గింజలు తినవచ్చు. దీన్ని 30 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే చాలా మంది రాత్రి పూట కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఉప్పు నీటితో స్నానం చేస్తే జుట్టు రాలిపోతుందా?

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు