దేశాధ్యక్షుడిని బంధించిన సైన్యం!

పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్ లో సైన్యం తిరుగుబాటు చేసింది. అక్కడి అధ్యక్షుడు మహ్మద్‌ బజౌమ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టామని సైన్యం ప్రకటించింది. ఊహించని సైన్యం తిరుగుబాటు కారణంగా దేశం సరిహద్దులన్నీ మూసివేశారు. దాంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించడం జరిగింది. సైనికులు తిరుగుబాటు చేసినట్లుగా దేశ వ్యాప్తంగా మీడియాలో ప్రచారం చేయడంతో ఈ విషయం తెలిసిన వారు ఆందోళనకు గురౌతున్నారు.

దేశాధ్యక్షుడిని బంధించిన సైన్యం!
New Update

పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్ లో సైన్యం తిరుగుబాటు చేసింది. అక్కడి అధ్యక్షుడు మహ్మద్‌ బజౌమ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టామని సైన్యం ప్రకటించింది. ఊహించని సైన్యం తిరుగుబాటు కారణంగా దేశం సరిహద్దులన్నీ మూసివేశారు. దాంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించడం జరిగింది. సైనికులు తిరుగుబాటు చేసినట్లుగా దేశ వ్యాప్తంగా మీడియాలో ప్రచారం చేయడంతో ఈ విషయం తెలిసిన వారు ఆందోళనకు గురౌతున్నారు.

అంతేకాకుండా నైజర్‌ లోని అన్ని సంస్థలను తక్షణమే నిలువరించినట్లు సైన్యం తెలిపింది. కల్నల్‌ మేజర్‌ అబ్ద్రమనే మీడియా ముందు ఈ వార్తను వినిపిస్తున్నప్పుడు ఆయన చుట్టు సుమారు 9 మంది సైన్యాధికారులు ఉన్నారు. వారిని తాను దేశ జాతీయ భద్రతా మండలిగా పిలుస్తున్నట్లు వివరించారు. నైజర్ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్‌ను అధికారం నుంచి సైన్యం తొలగించింది. అధ్యక్షుడిని అరెస్టు తరువాత సైనికుల బృందం గురువారం జాతీయ టెలివిజన్‌లో కనిపించి తిరుగుబాటును ప్రకటించింది.

నైజర్‌లో సైన్యం తిరుగుబాటు పరిణామాలపై అల్ జజీరా జర్నలిస్ట్ మైక్ వాన్నా మాట్లాడుతూ.. నైజర్ లో తాజా పరిణామాలు యూఎస్‌కి ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఎందుకంటే వారికి నైజర్ లో రెండు డ్రోన్ స్థావరాలు ఉన్నాయి. వారివద్ద దాదాపు 800 మంది సైనికులుకూడా ఉన్నారు. వీరిలో కొందరు ప్రత్యేక దళాలు నైజర్ సైన్యానికి శిక్షణ ఇస్తున్నాయి.

తన పై ప్రెసిడెన్షియల్‌ గార్డ్ సభ్యులు తిరుగుబాటుకు ప్రయత్నించారని నైజర్‌ అధ్యక్షుడు తెలిపారు. నైజర్ అధ్యక్షుడు బజౌమ్ 2021లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యారు. నైజర్ ఫ్రాన్స్, ఇతర పశ్చిమ దేశాలకు సన్నిహిత మిత్రదేశంగా పరిగణలో ఉంది. 1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుండి నైజర్‌లో తిరుగుబాట్లు జరిగాయి. అంతేకాకుండా పలుమార్లు తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి. ఈ దేశంలో ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపులకు చెందిన గ్రూపులు చురుగ్గా ఉన్నాయి.

అయితే ఈ సంఘటన పై అమెరికా నుంచి ఓ ప్రకటన వెలువడింది. బజౌమ్‌ను వెంటనే విడుదల చేయాలని అమెరికా పిలుపునిచ్చింది. యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ న్యూజిలాండ్‌లో విలేకరులతో మాట్లాడారు. నేను గురువారం ఉదయం ప్రెసిడెంట్ బజౌమ్ తో మాట్లాడాను. నైజర్‌ లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిగా యూఎస్‌ అతనికి గట్టిగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశాం. మేము అతనిని తక్షణమే విడుదల చేయాలని కూడా కోరుతున్నాం.

#africa #international #nizer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe