Nifty 50 Record: ఈ ఏడాది కూడా 2023 లానే భారత స్టాక్ మార్కెట్ పెరుగుదల కొనసాగుతోంది. ఇన్వెస్టర్స్ కి వేగంగా లాభాలు వస్తున్నాయి. దీంతో మార్కెట్ కూడా లాభపడుతోంది. ఈరోజు నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై ఫిగర్‌ను తాకింది. సెన్సెక్స్ పరిస్థితి కూడా అదే. సెన్సెక్స్.. నిఫ్టీలలో ఈ పెరుగుదల ఒక్క రోజులో పెట్టుబడిదారులను సంపన్నులను చేసింది. రూపాయి గురించి చెప్పాలంటే డాలర్‌తో పోలిస్తే ఇది కూడా మెరుస్తోంది. రూపాయి 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. వారంలో చివరి రోజున, పెట్టుబడిదారులు లాభాలను(Nifty 50 Record) బుక్ చేయడంతో.. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లో ఇంత పెరుగుదల ఎందుకు వచ్చింది? అనే సందేహం రావడం సహజం. దాని వెనుక ఏముంది? అనే విషయంపై నిపుణులు మూడు కారణాలు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Nifty 50 Record: స్టాక్ మార్కెట్ జంప్.. రూపాయి స్ట్రాంగ్.. మూడు కారణాలు..
వారాంతంలో అంటే శుక్రవారం జనవరి 12న స్టాక్ మార్కెట్ రికార్డులు సృష్టించింది. నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై కి చేరుకుంది. దీనికి కంపెనీల క్వార్టర్లీ ఫలితాల్లో అనుకూలత, మార్కెట్లో పాజిటివిటీ, డాలర్ తో రూపాయి బలపడటం కారణాలుగా నిపుణులు చెబుతున్నారు
Translate this News: