Nipah Virus: నిఫా వైరస్ గబ్బిలాల నుంచి వ్యాప్తి..!

కేరళలో నిపా వైరస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి చెందగా, ఆ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపించిందని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తెలిపింది. మలప్పురం జిల్లా బండికోడ్ కు చెందిన బాలుడికి గత జూన్‌ 14 లో నిపా వైరస్ సోకగా జూలై 21న మృతి చెందాడు.

Nipah Virus: నిఫా వైరస్ గబ్బిలాల నుంచి వ్యాప్తి..!
New Update

Kerala: కేరళలో నిపా వైరస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి చెందగా, ఆ వైరస్ గబ్బిలాల (Bats) నుంచి వ్యాపించిందని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారణ అయింది. మలప్పురం జిల్లా బండికోడ్ పంచాయతీకి చెందిన 14 ఏళ్ల బాలుడికి గత జూన్‌లో నిపా వైరస్ (Nipah Virus) సోకింది.

బాలుడిని కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చేర్చి ఇంటెన్సివ్ కేర్ అందించారు. అయితే బాలుడు జూలై 21న మృతి చెందాడు. బాలుడు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఓ దుకాణంలో పండ్లు కొని తిన్నాడని, షాపులో గబ్బిలాలు ఉన్నాయని ఆరోగ్యశాఖ జరిపిన విచారణలో తేలింది.

Also Read: స్టాక్ మార్కెట్ భారీ పతనం.. ఇన్వెస్టర్స్ కి రక్త కన్నీరు!

బాలుడి ప్రాంతంలోని దుకాణాల నుంచి గబ్బిలాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు.ఇందులో నిపా వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపించినట్లు నిర్ధారణ అయింది.ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ..

బాలుడు పండ్లను కొనుగోలు చేసి తిన్నాడని ఆరోపించిన ప్రాంతంలోని 27 గబ్బిలాల నమూనాలను (Bat Samples) పరీక్షించారు. వీరిలో ఆరు గబ్బిలాలకు నిపా వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. బాలుడితో పరిచయం ఉన్న 472 మంది నుండి నమూనాలను పరీక్షించగా, వారిలో ఎవరికీ వారి శరీరంలో నిపా వైరస్ లేదు. అయితే, నిపా వైరస్‌ లక్షణాలతో 261 మందిని 21 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, ఇంటెన్సివ్‌ అబ్జర్వేషన్‌లో ఉంచారు. నిపా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకున్నారు.

#nipah-virus #kerala-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe