ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు.. నికోలై సచ్‌దేవ్‌ షాకింగ్ కామెంట్స్!

వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే నికోలై సచ్‌దేవ్‌ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అనంతరం కొత్త జంట తొలిసారి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నికోలై వరలక్ష్మి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేం ప్రేమ వివాహం చేసుకున్నా.. తన ఫస్ట్‌ లవ్‌ సినిమాలే అని అన్నాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు.. నికోలై సచ్‌దేవ్‌ షాకింగ్ కామెంట్స్!
New Update

Nicholai Sachdev Shocking Comments On Varalaxmi Sarathkumar : తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్‌ గ్యాలరీల నిర్వాహకుడు నికోలై సచ్‌దేవ్‌ తో వరలక్ష్మి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటూ సినీ సెలెబ్రిటీలు సైతం ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యాయి.

కాగా వివాహం అనంతరం కొత్త జంట తొలిసారి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నికోలై సచ్‌దేవ్‌ వరలక్ష్మిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. తాజా సమావేశంలో నికోలై సచ్‌దేవ్‌ తాము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వరలక్ష్మి ఫస్ట్‌లవ్‌ తాను కాదని తెలిపారు. ఈ మేరకు అతను మాట్లాడుతూ.." నాకు తమిళం రాదు అందుకు నన్ను క్షమించండి. తమిళంలో పొంతటి (భార్య) అనే పదం మాత్రమే తెలుసు.

Also Read : కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఇదే.. లీక్ చేసిన హీరోయిన్, వైరల్ అవుతున్న పోస్ట్!

ప్రస్తుతం నేర్చుకుంటున్నాను. ఇక నుంచి నా ఇల్లు ముంబై కాదు.. చెన్నై. మీకు ముందుగా నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు నికోలై సచ్‌దేవ్‌. నాకు వరలక్ష్మి శరత్‌ కుమార్‌తో వివాహం అయ్యింది. అందరూ అనుకున్నట్లు పెళ్లి తర్వాత వరలక్ష్మి తన పేరును మార్చుకోదు. వరలక్ష్మి శరత్‌కుమార్‌లానే కొనసాగుతుంది. అయితే, నేను నా కూతురు తన పేరును తీసుకుంటున్నాం.

ఇకపై నాపేరును నికోలై వరలక్ష్మి శరత్‌కుమార్‌ సచ్‌దేవ్‌గా మార్చుకుంటున్నా"అని అన్నారు. అంతేకాకుండా "వరలక్ష్మి నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. మేం ప్రేమ వివాహం చేసుకున్నాం. కానీ నేను తనకు ఫస్ట్‌ లవ్‌ కాదు. ఆమె ఫస్ట్‌ లవ్‌ సినిమాలే. ఆ తర్వాతే నేను. అందుకే పెళ్లి తర్వాత కూడా తను సినిమాల్లో నటిస్తుంది" అని పేర్కొన్నారు.

#varalaxmi-sarathkumar #nicholai-sachdev
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe