మిస్‌ యూనివర్స్‌గా షెన్సిస్ పలాసియోస్

‘మిస్‌ యూనివర్స్‌ -2023’ కిరీటాన్ని నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ రన్నరప్‌గా నిలవగా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌గా ఎంపికైంది. ఇండియాకు చెందిన 23 ఏళ్ల శ్వేతా శారదా టాప్ 20లో చోటు దక్కించుకుంది.

New Update
మిస్‌ యూనివర్స్‌గా షెన్సిస్ పలాసియోస్

ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ అందాల పోటీలు ఎల్ సాల్వడార్‌ వేదికగా శనివారం ఘనంగా జరిగాయి. సెంట్రల్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్‌ మొదటిసారి ఈ వేడుకలను నిర్వహించగా ‘మిస్‌ యూనివర్స్‌ -2023’ (Miss Universe) 72వ కిరీటాన్ని నికరాగ్వా దేశానికి ప్రతినిథ్యం వహించిన షెన్నిస్ పలాసియోస్ (Sheynnis Palacios) దక్కించుకుంది. మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ (RBonney Gabriel) 2023 కిరీటాన్ని షెన్నిస్ పలాసియోస్ అలంకరించి కంగ్రాట్స్ చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 84 మంది మహిళలు మిస్ యూనివర్స్ వేదికను అలంకరించగా.. 23 ఏళ్ల పలాసియోస్ తన పేరును విజేతగా ప్రకటించడంతో భావోద్వేగానికిలోనైంది. అదే వేదికమీద ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. మిస్ యూనివర్స్ గెలుచుకున్న మొదటి నికరాగ్వా మహిళ అయిన షెన్నిస్ పలాసియోస్ ఈ పోటీ కోసం ధరించిన గౌను చూపరులను అట్రాక్ట్ చేసింది. ఇక మిస్ యూనివర్స్ 2023 పట్టాభిషేకం నికరాగ్వాకు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలచింది. అలాగే థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ రన్నరప్‌గా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌గా నిలిచారు.

publive-image

భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన 23 ఏళ్ల శ్వేతా శారదా టాప్ 20 ఫైనలిస్ట్‌లలో చోటు దక్కించుకుంది. ఈ పోటీల్లో 'ఆర్మర్డ్ గాడెస్' అనే థీమ్ తో రూపొందించిన కాస్ట్యూమ్స్ ధరించిన శ్వేతా వేడుకలో మెరిసిపోయింది. అలాగే జాతీయ పుష్పం కమలం స్ఫూర్తితో రూపొందించిన కిరీటాన్ని ధరించారు. దీంతో పాటు జాతీయ పక్షి నెమలి ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దారు. సవాళ్లను ఎదుర్కొనే, అభివృద్ధి చెందుతున్న దృఢమైన భారత్‌కు ప్రతీకగా ఈ కాస్ట్యూమ్‌ను నిధి అనే డిజైనర్ రూపొందించారు.

publive-image

ఈ సంవత్సరం మరో ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. గ్వాటెమాలా నుంచి మిచెల్ కోన్, కొలంబియా నుంచి మరియా కామిలా అవెల్లా మోంటానెజ్ అనే ఇద్దరూ ఇద్దరు వివాహిత తల్లులు మొదటిసారి ఈ పోటీలో పాల్గొన్నారు. అలాగే మిస్ నేపాల్ అయిన జేన్ దీపికా గారెట్ మొదటి ప్లస్-సైజ్ మోడల్‌గా ఇందులో పాల్గొని చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్ క్రీడాకారిణి ఎరికా రాబిన్ కూడా గ్లోబల్ పోటీలో అరంగేట్రం చేయడం విశేషం.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు