ISIS Terror Conspiracy Case: కర్నాటక, మహారాష్ట్రలో NIA ఏకకాలంలో దాడులు..13 మంది అరెస్ట్..!!

New Update
ISIS Terror Conspiracy Case: కర్నాటక, మహారాష్ట్రలో NIA ఏకకాలంలో దాడులు..13 మంది అరెస్ట్..!!

ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కుట్ర కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కర్నాటక, మహారాష్ట్రలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. శనివారం నిర్వహించిన దాడుల్లో 13మందిని అరెస్టు చేసింది. పూణేలో అరెస్టులు జరిగాయి. రెండు రాష్ట్రాల్లోని 40కిపై ప్రాంతాల్లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. యాంటీ టెర్రర్ ఏజెన్సీ కర్నాటకలో ఒక చోట, పూణేలో రెండు చోట్ల, థానేలో 9 చోట్ల, భయందర్ లో ఒక చోట, థానే రూరల్ 31 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది.

మహారాష్ట్ర, కర్నాటక పోలీసు బలగాల సమన్వయంతో ఎన్ఐఏ ఈ ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మహారాష్ట్రలోని ఐసిస్ మాడ్యూల్ పై ఈ ఏడాది జూన్లో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. జూలైలో ముంబైకి చెందిన తబీష్ నాజర్ సిద్ధఖీ, పూణేకు చెందిన జుబైర్ నూర్ మహ్మద్ షేక్ అలియాస్ అబూ నుసైబా, థానేకి చెందిన షార్జీల్ షేక్, జుల్ఫికర్ అలీ బరోదావాలా, పూణేలోని కోంధ్వా నుంచి డాక్టర్ అద్నాన్ సర్కార్ లను ఎన్ఐఏ అరెస్టు చేసింది.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో మోదీనే తోపు,టాపూ..గ్లోబల్ లీడర్స్ లో మరోసారి నరేంద్రుడిదే ఫస్ట్ ప్లేస్..!!

Advertisment
తాజా కథనాలు