గత కొన్నేళ్లుగా వాంటేడ్ ఐఏఎస్ ఉగ్రవాది లిస్ట్ లో ఉన్న రిజ్వాన్ అబ్దుల్ ను ఎన్ఐఏ ఢిల్లీ లో అరెస్ట్ చేసింది.కొన్నేళ్ల క్రితం పూణెలో కుట్ర పన్నిన ఏడుగురు ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. వారి నుంచి మారణాయుధాలు సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు రిజ్వాన్ అబ్దుల్ సహా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.
పరారీలో ఉన్న ఉగ్రవాదుల బెదిరింపుల మధ్య, రిజ్వాన్ గురించి సమాచారం ఇస్తే 3 లక్షల రూపాయల రివార్డును NIA ప్రకటించింది. సోదాలు కొనసాగించిన ఎన్ఐఏ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతంలో రిజ్వాన్‌ను అరెస్ట్ చేసింది. అతనికి సంబంధించిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు.