వాహనదారులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి సరికొత్త యాప్

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)ఓ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌లో వాతావరణ వివరాలతో పాటు దగ్గర్లోని టోల్ ప్లాజా, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, హోటల్స్ తదితర సమాచారం తెలుసుకోవచ్చు.

వాహనదారులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి సరికొత్త యాప్
New Update

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)గుడ్ న్యూస్ అందించింది. మెరుగైన సేవలు అందించేందుకు రాజ్‌మార్గ్ యాత్ర అనే కొత్త యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా రహదారుల సమాచారం తెలుసుకోవడంతో పాటు NHAIలకు సంబంధించిన సమస్యల గురించి కూడా ఫిర్యాదుచేసే వెసులుబాటు కల్పించింది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఐఓఎస్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే హిందీ, ఆంగ్ల భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి అన్ని ప్రాంతీయ భాషల్లోకి తీసుకురానుంది.

హైవేలపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు రాజ్‌మార్గ్ యాప్ ద్వారా వాతావరణ వివరాలతో పాటు టోల్ ప్లాజా, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, హోటల్స్, తదితర వాటి గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే ఫొటోలు, వీడియోల జియో ట్యాగింగ్ ద్వారా జాతీయ రహదారులపై ఉన్న సమస్యల గురించి కూడా యాప్‌లో ఫిర్యాదుచేయవచ్చు. ఈ ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించకపోతే.. సదరు ఫిర్యాదును ఆటోమేటిగ్గా ఉన్నతాధికారులకు పంపించే టెక్నాలజీ ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా ఫాస్ట్‌టాగ్ రీఛార్జ్, నెలవారీ పాసులు వంటి సేవలను పొందొచ్చు అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రమాదాల నియంత్రణకు ఈ యాప్‌లో ప్రత్యేక ఫీచర్ ఉందని కూడా వెల్లడించింది.

అలాగే వాహనాలు పరిమిత వేగం మించి ప్రయాణిస్తుంటే వెంటనే ఫోన్‌కు అలర్ట్ నోటిఫికేషన్ పంపిస్తుంది. అయితే ఈ ఫీచర్ పొందాలంటే వాహనదారుడి ఫోన్‌లో తప్పనిసరిగా ఈ యాప్ ఉండాలి. అలాగే ఫొన్‌ లొకేషన్, మైక్రోఫోన్ వంటి వాటిని ఉపయోగించేందుకు కూడా యాప్‌కు పర్మిషన్ ఇవ్వాలి. ఇందులో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. ప్రయాణికులకు రోడ్ నెట్‌వర్క్ సమాచారంతో పాటు యూజర్ ఫ్రెండ్లీ అనుభవం అందిచేందుకు ఈ యాప్ తీసుకువచ్చామని అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు అన్ని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆగాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్ వ్యవస్థను త్వరలోనే అమలు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్ స్థానంలో ఓపెన్ టోల్ వ్యవస్థ అమలుకు సంబంధించి ట్రయల్స్ కొనసాగుతున్నాయని పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతం కాగానే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. ముఖ్యంగా కెమెరాలు, ఉపగ్రహాలు వంటి టెక్నాలజీ ఆధారంగా ఈ కొత్త టోల్ సిస్టమ్ పనిచేస్తుంని.. ప్రస్తుతం ఢిల్లీ- మేరఠ్ ఎక్స్‌ప్రెస్ వేలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు వివరించింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe