న్యూ ఇయర్ సందర్బంగా వాణిజ్య LPG సిలిండర్ (LPG Price)ధరలు తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ కొత్త ధరలను విడుదల చేసింది. ప్రభుత్వ చమురు సంస్థ ఈ గ్యాస్ సిలిండర్ ధరలను స్వల్పంగా తగ్గించింది. కొత్త ధరలు జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. అయితే, డొమెస్టిక్ 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ (LPG Price) ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతోపాటు విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్ ఫ్యూయల్) ధరల్లో కూడా నేటి నుంచి మార్పులు చోటుచేసుకున్నాయి.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల (Commercial gas cylinders)ధరలో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. నేటి నుంచి ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1755.50కి చేరింది. ఇంతకుముందు రూ.1757కి వస్తోంది. ముంబైలో, ఈ సిలిండర్ గతంలో 1710 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇది ఇప్పుడు 1708.50 గా మారింది. చెన్నైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1929 నుంచి రూ.1924.50కి తగ్గింది. అదే సమయంలో, కోల్‌కతాలో ఈ గ్యాస్ సిలిండర్ ఇప్పుడు రూ. 1868.50కి బదులుగా రూ.1869కి అందుబాటులో ఉంది.
జనవరి 1, 2024 నుండి ఎయిర్‌లైన్స్‌లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF ధర) ధరలలో కూడా మార్పు జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో ATF కొత్త ధర రూ. 1,01,993.17/Klగా మారింది. ఈ ధర కోల్‌కతాలో రూ. 1,10,962.83/Kl, ముంబైలో రూ. 95,372.43/Kl , చెన్నైలో రూ. 1,06,042.99/Klగా మారింది. 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దీని ధరలు చివరిగా ఆగస్టు 30, 2023న మార్చబడ్డాయి. మెట్రో నగరాల గురించి చెప్పాలంటే, ఈ LPG సిలిండర్ ఢిల్లీలో రూ. 903కి అందుబాటులో ఉంది. అదే సమయంలో కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902, చెన్నైలో రూ.918కి అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి: రైతులకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త..ఖాతాల్లోకి రూ. 8వేలు..!!