Khammam Politics: ఖమ్మం పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్.. రంగంలోకి మాజీ సీఎం కుమారుడు.. ఇండిపెండెంట్ గా బరిలోకి..

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం టికెట్ సీపీఐకి ఇస్తే కాంగ్రెస్ కేడర్ తన వెంటే ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Khammam Politics: ఖమ్మం పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్.. రంగంలోకి మాజీ సీఎం కుమారుడు.. ఇండిపెండెంట్ గా బరిలోకి..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో (telangana politics) రోజుకో ఊహించని పరిణామం చోటు చేసుకుంటోంది. రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు అయితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరో ఎత్తు అన్నట్లుగా ఉంది పరిస్థితి. పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ట్విస్ట్ ఇచ్చారు మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు (Jalagama Venkat Rao). ఈ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆయన డిసైడ్ సమాచారం. 2014 ఎన్నికల్లో ఆయన కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. కొన్ని రోజులకు వనమా బీఆర్ఎస్ లో చేరిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు వెంకట్రావు దూరంగా ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: TS Congress: కాంగ్రెస్‌లో మరో వికెట్‌.. నాగం గుడ్‌బై?

అయితే.. ఆనాటి నుంచి వనమా గెలుపు చెల్లదంటూ ఆయన న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సుప్రీం ధర్మాసనం ఎదుట ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. అక్టోబర్ 31న బెంచ్ ముందుకు వనమాపై అనర్హతవేటు పిటిషన్ విచారణకు రానుంది. ఇదిలా ఉంటే.. కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని జలగం ఆశించారు. కానీ కేసీఆర్ వనమాకే టికెట్ ఇవ్వడంతో వెంకట్రావు నిరాశకు గురయ్యారు. తాజాగా పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించనున్నట్లు వార్తలు రావడంతో జలగం మళ్లీ అలర్ట్ అయ్యారు. ఇండింపెండెంట్ గా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Neelam Madhu: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. నీలం మధు రాజీనామా

తాను పోటీ చేస్తే కాంగ్రెస్ ఓటింగ్ తనకే కన్వర్ట్ అవుతుందన్న భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. జలగం కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని అనుబంధం ఉంది. వెంకట్రావు తండ్రి జలగం వెంగళరావు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. సత్తుపల్లి నుంచి జలగం కుటుంబ సభ్యులు అనేక పర్యాయాలు గెలుపొందారు. వెంకట్రావు సైతం 2004లో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

2009లో ఎన్నికల్లో సత్తుపల్లి ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆయన ఖమ్మం కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్థి తుమ్మలపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ లో చేరి కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఒకసారి గెలుపొందగా.. మరో సారి ఓటమి పాలయ్యారు

Advertisment
Advertisment
తాజా కథనాలు