New Twist in Student Ritu Sahu Incident: వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. నెలన్నర తర్వాత కీలక మలుపు!!

వైజాగ్ కు చేరుకున్న బెంగాల్ పోలీసులు.. హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్య సహాయం చేసిన ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం, వారి పాత్రపై విచారణ మొదలు పెట్టారు. అనంతరం ఓ క్లారిటీకి వచ్చాక గురువారం రితు సాహు మృతిపై సెక్షన్ 174 నుంచి ఐపీసీ 304 పార్ట్ 2గా మార్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు విశాఖ పోలీసులు. రిపోర్టు ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. ఇన్ని రోజులు రితు సాహు ది ఆత్మహత్యగా భావించిన విశాఖ పోలీసులు.. అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఇక కాలేజీ, హాస్టల్ యాజమాన్య నిర్లక్ష్యంగా ఉన్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్యం చేసిన డాక్టర్ల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టారు.

New Twist in Student Ritu Sahu Incident: వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. నెలన్నర తర్వాత కీలక మలుపు!!
New Update

New Twist in Inter Student Ritu Sahu Incident in Visakhapatnam: విశాఖ పట్నంలోని బెంగాల్ స్టూడెంట్ రితు సాహు కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఘటన జరిగిన నెలన్నర తర్వాత ఈ కేసును హత్య కేసుగా పోలీసులు మార్చారు. బాలిక మృతిపై రోజు రోజుకూ అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ కేసులోకి బెంగాల్ పోలీసులు ఎంట్రీ ఇచ్చాక.. మొత్తం కేసు స్టడీనే మారిపోయింది. ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదంటూ.. విద్యార్థిని తల్లితండ్రులు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి, ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకోవాలని పోలీసులకు సీఎం మమతా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కోల్ ‌కతాలోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో విశాఖలో విద్యార్ధిని హత్యకు గురైనట్లు గతంలో సెక్షన్ 302 కింద కేసు నమోదైంది.

అనుమానస్పద మృతిగా కేసు నమోదు:

విచారణలో భాగంగా వైజాగ్ కు చేరుకున్న బెంగాల్ పోలీసులు.. హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్య సహాయం చేసిన ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం, వారి పాత్రపై విచారణ మొదలు పెట్టారు. అనంతరం ఓ క్లారిటీకి వచ్చాక గురువారం రితు సాహు మృతిపై సెక్షన్ 174 నుంచి ఐపీసీ 304 పార్ట్ 2గా మార్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు విశాఖ పోలీసులు. రిపోర్టు ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. ఇన్ని రోజులు రితు సాహు ది ఆత్మహత్యగా భావించిన విశాఖ పోలీసులు.. అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఇక కాలేజీ, హాస్టల్ యాజమాన్య నిర్లక్ష్యంగా ఉన్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్యం చేసిన డాక్టర్ల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టారు.

మృతికి దారి తీసిన కారణాలపై పలు అనుమానాలు:

కాగా విద్యార్థిని రితు సాహు ఆస్పత్రిలో ఉన్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. హాస్టల్ బిల్డింగ్ పై నుంచి కింద పడిన తర్వాత ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించింది బై జూస్ యాజమాన్యం. అయితే విద్యార్థిని ఒంటిపై బలమైన గాయాలు ఏమీ కనిపించలేదు. ఇప్పుడు రితు ఒంటి పై బలమైన గాయాలు లేక పోవడం, మృతికి దారి తీసిన కారణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో వైద్యులకు సహకరించకుండా రితు అడ్డుకుంది. ప్రస్తుతం ఈ కేసుపై అటు బెంగాల్ పోలీసులు.. ఇటు వైజాగ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇవి కూడా చదవండి:

మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!!

Srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల్లో నష్టం

#crime-news #visakhapatnam #incident #new-twist-in-student-ritu-sahu-case #new-twist #inter-student-ritu-sahu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe