అన్నవరం వెళ్లే భక్తులకు గమనిక.. ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే!!

అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒక్కసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం ఉండదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కొత్త సాఫ్ట్ వేర్ ను కూడా అప్ డేట్ చేయించారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా భక్తులు వసతి గది తీసుకునే విషయంలో పలు కండీషన్లు తీసుకొచ్చింది. భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసి వెళ్లిపోయేటప్పుడు ఫింగర్ ప్రింట్స్ (వేలిముద్రలు) తీసుకోవడం తప్పనిసరి చేసింది..

అన్నవరం వెళ్లే భక్తులకు గమనిక.. ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే!!
New Update

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి మహిమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అన్నవరం వెళ్లే భక్తులకు కొత్త రూల్స్ జారీ చేసింది దేవాదాయ శాఖ. ఇకపై సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు కొత్త కండీషన్లు అప్లై చేసింది. వసతులపై దేవాదాయ శాఖ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. భక్తులు వసతి గదిని తీసుకోవడానికి ఆధార్ కార్డును ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.

అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒక్కసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం ఉండదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కొత్త సాఫ్ట్ వేర్ ను కూడా అప్ డేట్ చేయించారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా భక్తులు వసతి గది తీసుకునే విషయంలో పలు కండీషన్లు తీసుకొచ్చింది.

భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసి వెళ్లిపోయేటప్పుడు ఫింగర్ ప్రింట్స్ (వేలిముద్రలు) తీసుకోవడం తప్పనిసరి చేసింది. అలాగే భక్తులకు ఏయే వసతి సముదాయం వద్ద ఎన్ని గదులు ఖాళీగా ఉన్నాయి? ఎన్ని బుక్ అయ్యాయి? అనేది తెలుసుకునేందుకు కొండ దిగువన సీఆర్వో కార్యాలయం వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ అంశాలను భక్తులు పరిగణలోకి తీసుకోవాలని అధికారయంత్రాంగం స్పష్టం చేసింది.

కాగా ఈమధ్యే సత్యదేవుని వ్రతం, నిత్య కళ్యాణం, ఇతర పూజలకు భక్తులు సంప్రదాయ వస్త్రధారనలో పాల్గొనాలని నిబంధనను అమలు చేశారు. ఈమేరకు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వ్రతం, ఇతర పూజల్లో పాల్గొనేందుకు పురుషులు పంచె, కండువా, లేదా కుర్తా, పైజామా, మహిళలు చీర లేదా కుర్తా, పైజామా తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు.

అలాగే భక్తులకు అరిటాకులకు బదులు ప్లేట్లలోనే అన్న ప్రసాదం అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అరిటాకుల లభ్యత పూర్తి స్థాయిలో లేకపోవడంతో కంచాల్లో అన్న ప్రసాదం అందిస్తున్నారు. ఈ ఆలయంలో నిత్యం మధ్యాహ్నం పూట అన్నప్రసాదం అందిస్తుండగా.. గతంలో అరిటాకుల్లో భక్తులకు భోజనాలు వడ్డించారు.. ఇప్పుడు ప్లేట్లలో వడ్డిస్తున్నారు.

#annavaram #annavaram-temple #devotees #new-rules
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe