New Movies: ఏదైనా చేయాలంటే సమయం సందర్భం ఉండాలంటారు. దీనిని మన టాలీవుడ్ అర్థం చేసుకున్నట్టు ఎవరూ చేసుకోలేదు అనిపిస్తుంది. అవును.. నెలరోజులుగా అంటే నాలుగు వారాలుగా తెలుగులో ఒక్క పెద్ద సినిమా కూడా విడుదల కాలేదు. అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు తరువాత అన్నీ చిన్న సినిమాలే విడుదల అయ్యాయి. దీపావళి పండక్కి కూడా పెద్ద సినిమాలు విడుదల కాలేదు. దీనికి కారణం ఒక్కటే… వరల్డ్ కప్! మన దేశంలో క్రికెట్ ఫీవర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ప్రపంచ కప్.. భారత్ వేదికగా జరుగుతుంటే.. సినిమాలపై ఎవరూ ఫోకస్ పెట్టరు. సినిమాల్ని ఎంతగా ప్రేమించేవారైనా సరే.. తన అభిమాన హీరో సినిమా ఉన్నాసరే.. క్రికెట్ తరువాతే అని చెప్పేస్తారు. సినిమా.. ఇవ్వాళ కాకపొతే రేపు చూడొచ్చు.. క్రికెట్ మ్యాచ్ అలా కాదుగా అనేస్తారు. అందుకే.. టాలీవుడ్ నిర్మాతలు వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్స్ సందర్భంలో సినిమాలు రిలీజ్ చేయకుండా ఆగిపోతారు.
ఇప్పుడు వరల్డ్ కప్ పూర్తయిపోయింది. ఇక సినిమాలపై(New Movies) ఫోకస్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇంకేముంది మన పెద్ద హీరోలు వరుసగా పలకరించడానికి రెడీ అయిపోతున్నారు. డిసెంబర్ లో మోస్ట్ ఇంట్రస్టింగ్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. వరుసగా ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పటీకే చాలా సినిమాలు టీజర్లు.. ట్రైలర్లు సందడి చేస్తున్నాయి. ఈ సినిమాలన్నిటిపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న సినిమాలు కూడా ఉన్నాయి.
సాధారణంగా సంక్రాంతికి పండగ సినిమాల(New Movies) హంగామా ఉంటుంది. ఈసారి ఒక నెల ముందుగానే తెలుగు సినిమాల పండగ స్టార్ట్ అయిపోతోంది. డిసెంబర్ లో కొత్త సినిమాల మోత ధియేటర్ల దగ్గర గట్టిగానే ఉండబోతోంది. డిసెంబర్ లో అందరికంటే ముందుగా ప్రేక్షకులను ‘హాయ్ నాన్నా’ అంటూ పలకరించడానికి వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్లతో ప్రేక్షకుల్లో పెద్ద బజ్ వచ్చింది. తాజగా సినిమాకి కొత్త తరహాలో నానీ ప్రమోషన్ వీడియోలు యూట్యూబ్ లో సందడి చేస్తున్నాయి. ఇక డిసెంబర్ 8న మూడు సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి.. ఒకటి వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఇటీవలే ఒక ఇంటి వాడైన వరుణ్ తేజ్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. యూత్ స్టార్ గా విజయాలతో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఇదేరోజు హడావుడి చేయ బోతోంది. ఇప్పటికే సినిమా ట్రైలర్, టీజర్, పాటలు నెట్టింట్లో మోత మోగిస్తున్నాయి. ఇక అదేరోజు విడుదలవుతున్న మూడో సినిమా నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీమేన్’. ఇది నితిన్ సొంత బేనర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిమీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే వీటిలో ఒకటి లేదా రెండు సినిమాలు వెనక్కి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఏది ఏమైనా 8వ తేదీన థియేటర్ల వద్ద గట్టి పోటీ ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. చిరంజీవి పాటకు రోజా దుమ్ములేపే డ్యాన్స్!
డిసెంబర్ మొదటి రెండు వారాలు ఒక లెక్క.. మూడోవారం నుంచి మరో లెక్క. ప్రభాస్ వస్తున్నాడు.. బాక్సాఫీస్ షేక్ చేస్తాడు అంటున్నారు. డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 1న ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది.. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అంచనాలతో ఈ ఏడాది వస్తున్న చివరి సినిమా ఇదే.
ఇవేకాకుండా కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని డిసెంబర్ లో పలకరించడానికి రెడీ అవుతున్నాయి. అంతేకాదు బాలీవుడ్ నుంచి కూడా రెండు ఇంట్రస్టింగ్ సినిమాలు డిసెంబర్ లో రాబోతున్నాయి. డిసెంబర్ 1 న రణబీర్ కపూర్ ‘యానిమల్’ వస్తోంది. నెలాఖరులో సలార్ కు పోటీగా అన్నట్టు షారుక్‌ఖాన్ ‘డంకీ’ విడుదలకు రెడీ అయింది. పాన్ ఇండియా లెవెల్ లో చూసుకుంటే, ముగ్గురు టాప్ హీరోలు ప్రభాస్, రణబీర్ కపూర్, షారుక్‌ఖాన్, ఒకే నెలలో రాబోతున్నాయి. సో.. డిసెంబర్ ఒకటి నుంచి సినీ ప్రియులకు.. అభిమానులకు పెద్ద పండగ స్టార్ట్ అయిపోతుంది.
ఇక డిసెంబరు మూడో వారం నుంచి ప్రభాస్ ‘సలార్’ జోరు మొదలు కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘సలార్’ డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 1న ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో ఇదొకటి. ప్రముఖ హీరోల సినిమాలతోపాటు... పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాల జోరు కూడా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. రణ్‌బీర్‌కపూర్ ‘యానిమల్’ సినిమాతో డిసెంబరు 1న సందడి చేయనున్నారు. తెలుగు దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించిన చిత్రమిది. ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. షారుక్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘డంకీ’ అదే నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రభాస్, రణ్‌బీర్, షారుక్ తదితర అగ్ర కథానాయకుల చిత్రాలు ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తుండడంతో థియేటర్లలో భారీ స్థాయిలో హంగామా కనిపించే అవకాశాలున్నాయి. బలమైన అభిమానగణాన్ని సొంతం చేసుకున్న హీరోలు కావడంతో వసూళ్లు కూడా బాక్సాఫీస్ ను కళ కళలాడేలా చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Watch this Latest Video: