Sasivadane: 'శశివదనే' కొత్త లుక్.. ఎమోషనల్ రైడ్‌ను ఫీల్ అయ్యేందుకు రెడీగా ఉండండి!

రంజాన్ పర్వదినం సదర్భంగా 'శశివదనే' నుంచి కొత్త లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. 'కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈద్‌ ఉల్‌ ఫితర్‌ లాంటి వేడుక మన శశివదనే. మరో 8 రోజుల్లో మీ ముందుకు రాబోతుంది. ఎమోషనల్ రైడ్‌ను ఫీల్ అయ్యేందుకు రెడీగా ఉండండి' అంటూ ట్వీట్ చేశారు.

New Update
Sasivadane: 'శశివదనే' కొత్త లుక్.. ఎమోషనల్ రైడ్‌ను ఫీల్ అయ్యేందుకు రెడీగా ఉండండి!

Sasivadane: యంగ్ హీరో రక్షిత్‌, కోమలీ ప్రసాద్‌ జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ 'శశివదనే'. సాయి మోహన్‌ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమానుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, లుక్స్ అభిమానులను తెగ ఆకట్టుకోగా మరో వీడియోతో ప్రేక్షకులను అలరించారు మేకర్స్. ఏప్రిల్‌ 19న విడుదల కానున్న చిత్రం నుంచి రంజాన్ సందర్భంగా బ్యూటీఫుల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

ఈద్‌ ఉల్‌ ఫితర్‌ లాంటి శశివదనే..
ఈ మేరకు 'థాంక్యూ కొనసీమ' అంటూ రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఈద్‌ ముబారక్‌ చెబుతూ కొత్త లుక్‌ విడుదల చేశారు. 'కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈద్‌ ఉల్‌ ఫితర్‌ లాంటి వేడుక మన శశివదనే. మరో 8 రోజుల్లో మీ ముందుకు రాబోతుంది. ఎమోషనల్ రైడ్‌ను ఫీల్ అయ్యేందుకు రెడీగా ఉండండి' అంటూ రిలీజ్ చేసిన లుక్‌ వైరల్ అవుతోంది. అలాగే షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ తోపాటు మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిన కోనసీమకు ధన్యవాదాలు తెలిపారు మేకర్స్‌.

ఇక ఈ మూవీని గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్‌ కన్‌స్ట్రక్షన్స్‌, ఏజీ ఫిలిం కంపెనీతో కలిసి అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. ప్రవీణ్‌ యెండమూరి, తమిళ నటుడు శ్రీమాన్‌, కన్నడ యాక్టర్‌ దీపక్‌ ప్రిన్స్‌, జబర్దస్త్‌ బాబీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు