New Judges: సుప్రీంకోర్టులో కొత్త నియామకాలు జరిగాయి. జడ్జ్‌లుగా జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్.మహదేవన్‌లు బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త నియామకాలతో మూడు నెలల తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది. ఏప్రిల్ 11న జస్టిస్ అనిరుద్ధబోస్ వేసవి సెలవులకు కొద్ది రోజుల ముందు జస్టిస్ ఎ.ఎస్.బోపన్నలు పదవీ విరమణ చేయడంతో రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. ఐదుగురు సభ్యులో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం జులై 11న జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్.మహదే వాన్‌ల పేర్లను ప్రతిపాదించగా.. వారం రోజులలోపే కేంద్ర ప్రభుత్వం నియామకాలకు అనుమతినిచ్చింది. సుప్రీంకోర్టులో తొలిసారి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌కు ప్రాతినిథ్యం దక్కిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ మొదటిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Supreme court: సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు జడ్జ్‌లుగా జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్.మహదేవన్‌లు బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
New Update
Advertisment