Arogyasri Cards : రాజీవ్ ఆరోగ్యశ్రీ(Rajiv Arogyasri) పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) లబ్ధిదారులకు కొత్త కార్డులు ఇవ్వనుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు(Private Insurance Companies) ఇచ్చే కార్డుల తరహాలోనే.. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని యూనిక్ ఐడీతో కార్డులు తేనున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సబ్ నంబర్ ఇవ్వనున్నారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను మెయింటెయిన్ చేయనున్నారు.
రేషన్ కార్డులతో సంబంధం లేకుండా..
కొత్త ఆరోగ్యశ్రీ కార్డులయిన ఆరోగ్యశ్రీకి రేషన్‌కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపచేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దాంతో పాటూ ఆరోగ్యశ్రీ కార్డు(Arogyasri Card) లో ఇప్పటివరకు ఉన్న ఫెసిలిటీసే కాకుండా మరి కొన్నింటిని జత చేయాలని చూస్తోంది. ఇప్పుడు తాజాగా మరో వంద చికిత్సలను చేర్చేందుకు వైద్యశాఖ సమాయత్తమవుతోంది.
Also Read : Arogyasri Cards: ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర సర్కార్
ట్రామా కేర్ కూడా..
ఆరోగ్యశ్రీ పరిధిలోకి ట్రామాకేర్ ప్యాకేజ్(Trauma Care Package) తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. దీనికి అదనంగా రూ.400కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి రూ.1,100 కోట్లు ఖర్చు అవుతోంది. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ లిమిట్‌ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఇప్పుడు ఈ అదనపు చికిత్సలను చేరిస్తే ఈ ఖర్చు మరింత పెరుగుతంది. అయినా కూడా ఈ విషయంలో వెనకడుగు వేయకూడదని భావిస్తోంది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల సిస్టమ్‌ను వీలయినంత తొందరలో ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశాలను జారీ చేశారు.