Health Benefits: సూపర్‌ మార్కెట్‌లో ఇవి అస్సలు కొనకండి..డేంజర్‌

శుభ్రంగా ప్యాక్‌ చేసి అన్ని సిద్ధంగా ఉన్నాయి కదాని సూపర్‌ మార్కెట్‌ వెళ్లి తీసుకుంటున్నారా..? అయితే కొన్ని వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

New Update
Health Benefits: సూపర్‌ మార్కెట్‌లో ఇవి అస్సలు కొనకండి..డేంజర్‌

Never Buy Frozen Food in Supermarket: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఏది కావాలన్నా సూపర్‌ మార్కెట్‌ల వైపు పరుగులు తీస్తున్నారు. శుభ్రంగా ప్యాక్‌ చేసి రెడీగా ఉంటాయి. అంతేకాకుండా అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయని, కట్‌ చేసుకునే బాధకూడా ఉండదనే కారణంతో ఎక్కువశాతం మంది సూపర్‌మార్కెట్‌లకు వెళ్లి కావాల్సినవి కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువగా సిద్ధంగా ఉన్న కోల్డ్ కట్స్‌ను కొంటుంటారు. వీటినే ఫ్రోజెన్ ఫుడ్స్ (Frozen Foods) అని పిలుస్తారు. అంటే కార్న్, బ్రకోలి వంటివి కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పూర్తిగా విచ్ఛిన్నం అవుతాయి

బ్రకోలీ (Broccoli).. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. అయితే దీన్ని ఫ్రోజెన్ చేసినప్పుడు టేస్ట్‌తో పాటు ఆకృతి కూడా మారిపోతుంది. అందుకే దీన్ని సూపర్ మార్కెట్ల నుంచి కాకుండా స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేస్తే బాగుంటుంది. బ్రకోలీని కవర్‌లో ఉంచి ఫ్రీజ్‌ చేయడంతో స్పటికాల అభివృద్ధికి దారితీస్తుంది. దానిలోని పోషక విలువలు కూడా ఘననీయంగా తగ్గిపోతాయి. స్ట్రాబెర్రీస్‌ (Strawberry) రుచి బాగుండటంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతారు. ఇవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అయితే వీటిని సీజన్‌లో మాత్రమే కొనుగోలు చేయాలని వైద్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ స్ట్రాబెర్రీస్లో పోరస్ స్వభావం ఉంటుంది. నీటితో నిండి, ఘనీ భవించడంతో ఇవి పూర్తిగా విచ్ఛిన్నం అవుతాయి. దీంతో టేస్ట్‌, ఆకృతి పోతుంది.

లోపల తొందరగా కుళ్లిపోతాయి

కొన్ని సందర్భాల్లో కాల్షియం క్లోరైడ్, కాల్షియం లాక్టేట్, కాల్షియం ఆస్కార్బేట్, కాల్షియం ప్రోపియోనేట్‌లాంటి ప్రిజర్వేటివ్స్ స్ట్రాబెర్రీల లైఫ్‌, టేస్ట్‌ను పెంచేందుకు ఉపయోగిస్తారు. కొత్తిమీర, పుదీనా కడిగి, కట్‌ చేసే ఓపిక లేదని సూపర్‌ మార్కెట్లలో (Supermarket) తీసుకుంటారు. అయితే ఇవి గడ్డకట్టే క్రమంలో వీటి సామర్థ్యం, రుచి మొత్తం పోతుంది. అంతేకాకుండా కలిపి ప్యాకింగ్‌ చేయడం కారణంగా లోపల తొందరగా కుళ్లిపోతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు తాజాగా తెచ్చుకోవాలి. అంతేకాకుండా బర్గర్ ప్యాటీలు, కోల్డ్ స్టోర్ నుంచి నగ్గెట్స్ కొనడం తగ్గించాలి, వీలైతే ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది. ఎందుకంటే బయట కొంటే పిండి పదార్థాలు, ఎమల్సిఫైయర్లతో నిండి ఉంటాయి. మరోవైపు ఎక్కువ సమయం ఫ్రిజ్‌లో ఉంచటంతో రుచికూడా పోతుంది. పుట్టగొడుగులు.. సూపర్ మార్కెట్ నుంచి క్లీన్ ఫ్రోజెన్ ప్యాక్ పుట్టగొడుగులు కొంటుంటాం. కానీ వీటిని ఫ్రోజెన్ చేసిప్పుడు మెత్తగా, తడిగా మారిపోతాయి. అలాంటి వాటిని తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకే సూపర్ మార్కెట్లో లభించే ఈ ఫ్రోజెన్ ఫుడ్స్‌ను దూరం పెట్టి తాజాగా ఉన్నవాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది.

ఇది కూడా చదవండి: చిత్తూరులో విచిత్రం… ఫ్లెక్సీల కోసం ఊరిని పంచుకున్న వైసీపీ నేతలు

Advertisment
తాజా కథనాలు