Pallavi Prashanth Arrest: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. కామన్ మ్యాన్ గా టైటిల్ గెలిచి బిగ్ బాస్ చరిత్రలో రికార్డ్ సృష్టించాడు. టైటిల్ గెలిచానని ఆనందించే లోపే.. వివాదంలో చిక్కుకున్నాడు ప్రశాంత్. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రశాంత్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. కంటెస్టెంట్స్ కార్లు, ప్రభుత్వ బస్సులను ధ్వంశం చేశారు. పోలీసుల ఆదేశాలను లెక్క చేయకుండ ర్యాలీ నిర్వహించి ఈ ఘటనకు కారణమైనందుకు ప్రశాంత్, అతని అభిమానుల పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బుధవారం సాయంత్రం పోలీసులు పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో విచారణ జరిపిన అనంతరం 14 రోజుల పాటు చెంచల్ గూడ జైల్లో రిమాండ్ కు తరలించారు.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశాంత్ అరెస్ట్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం చేసుకునే రైతు నుంచి బిగ్ బాస్ విజేతగా గెలిచిన.. ఒక రైతు బిడ్డ సెలెబ్రెటీగా మారినందుకు సంతోషించాల్సింది పోయి అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. విజేతగా గెలిచిన ఆనందం.. కనీసం మూడు రోజులు కూడా లేకుండ ఒక రైతు బిడ్డను అరెస్ట్ చేశారు. ఇదే ఒక హీరో అయితే భద్రత, బందోబస్త్ తో ముందుగానే ఏర్పాట్లు చేసేవారు కదా ..? ఇలానే అరెస్ట్ చేసేవారా.? అంటూ నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కొన్ని లక్షల మంది అభిమానించిన పల్లవి ప్రశాంత్ కు బందోబస్త్, భద్రత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమయ్యింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రజా ప్రభుత్వంలో ఒక రైతు బిడ్డ అరెస్ట్ అయ్యాడు. ఇది మట్టి బిడ్డ పై జరిగిన దాడి అంటూ విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఇలా కామెంట్స్ చేస్తున్నారు..
ఎవడికో ఏదో చేద్ధాం అంటే అంగీకరించే సమాజం కాదు ఇది
& ముఖ్యంగా మనలాంటి సామాన్యులకి గౌరవం దక్కితే
తట్టుకోలేని జీవరాసులు ఉండే ప్రదేశం..
ఇప్పటికైనా కళ్ళు తెరువు👍🤷♂️#BiggBossTelugu7 #PallaviPrashanth#BiggBossTelugu7Updates #Arrest #WeAreWithPallaviPrashanth pic.twitter.com/3aqiKjaYNE
— Pallavi Prashanth (@AshokReddybb05) December 21, 2023
Also Read: Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కోసం సింగర్ భోలే ఫైట్..!