Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ ఎంట్రీపై నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్‌ బచ్చన్‌' ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్‌ 12 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది. తెలుగుతో పాటూ తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్‌ కానున్నట్లు వెల్లడించింది.

Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ ఎంట్రీపై నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
New Update

Mr.Bachchan OTT : హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజు రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మిస్టర్ బచ్చన్'.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

అవుడ్ డేటెడ్ కంటెంట్ తీసుకోని దానికి కమర్షియల్ హంగులు అంటూ హరీష్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టడంతో సినిమాకు భారీ నష్టాలొచ్చాయి. ఇలాంటి తరుణంలో త్వరగానే సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ‌'మిస్టర్‌ బచ్చన్‌' ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.


Also Read : ప్రీ సేల్స్ లో ‘దేవర’ హవా.. అప్పుడే అన్ని లక్షల టికెట్లు అమ్ముడయ్యాయా?

సెప్టెంబర్‌ 12 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని ఒక పోస్టర్‌ ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్‌ కానున్నట్లు వెల్లడించింది. మరి థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

#raviteja #mr-bachchan-ott
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe