Bharateeyudu 2 : 'భారతీయుడు 2' కు నెగిటివ్ టాక్.. నిర్మాతలకు షాకిచ్చిన నెట్ ఫ్లిక్స్?

కమల్ హాసన్ 'భారతీయుడు' 2 ఇటీవలే విడుదలై డిజాస్టర్ టాక్ అందుకుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ రూ.120 కోట్లకు డీల్‌ సెట్‌ చేసుకోగా.. ఇప్పుడేమో అంత మొత్తం చెల్లించేందుకు ముందుకు రావడం లేదట. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిసింది.

Bharateeyudu 2 :  'భారతీయుడు 2' కు నెగిటివ్ టాక్.. నిర్మాతలకు షాకిచ్చిన నెట్ ఫ్లిక్స్?
New Update

Bharateeyudu 2 Movie : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'భారతీయుడు 2' ఇటీవలే థియేటర్లలో విడుదలై డిజాస్టర్ టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో పలు సమస్యలు నెలకొన్నాయి. 'భారతీయుడు' 2 ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సంస్థ సుమారు రూ.120 కోట్లకు డీల్‌ సెట్‌ చేసుకుందని సమాచారం. అయితే, సినిమా విడుదలయ్యాక పరిస్థితి మారిపోయింది.

దీంతో డీల్‌ ప్రకారం ఉన్న అంత మొత్తం చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ముందుకు రావడం లేదట. ఈమేరకు లైకా ప్రొడక్షన్స్‌తో మళ్లీ చర్చలు జరిపి రూ. 60 కోట్లకు ఫైనల్‌ చేయాలని కోరిందట. ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో భారతీయుడు ఓటీటీలో వచ్చేందుకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Also Read : చచ్చినా అలాంటి పాత్రలో నటించను : జాన్వీ కపూర్

కాగా ఈ సినిమా కోసం మేకర్స్ సుమారు రూ. 250 కోట్లు ఖర్చు చేయగా..బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 120 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్‌ రాబట్టినట్లు సమాచారం. 1996 లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ , బాబీ సింహ, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.మరోవైపు ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్-3 కూడా రాబోతుంది. వచ్చే ఏడాది పార్ట్-3 రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

#bharateeyudu-2 #bharateeyudu-2-ott
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe