Netflix Free Plan: ఇకపై ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్.. పోలా.. అదిరిపోలా.. 

నెట్‌ఫ్లిక్స్ భారత్ సహా.. కొన్ని ఆసియా దేశాలు, యూరప్ లో ఫ్రీ సర్వీస్ తీసుకురావాలని ఆలోచిస్తోంది. తన కంటెంట్ ఫ్రీగా చూసేలా ప్లాన్ చేస్తోంది. అయితే, ఫ్రీ సర్వీస్ లో చూసే కంటెంట్ మధ్యలో యాడ్స్ ఉంటాయి. అంటే, యూట్యూబ్ లా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా ఉంటుంది. 

New Update
Netflix Free Plan: ఇకపై ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్.. పోలా.. అదిరిపోలా.. 

Netflix Free Plan:  మీరు నెట్‌ఫ్లిక్స్‌ అభిమాన.. అక్కడ సినిమాలు చూడటం అంటే సరదానా.. కానీ మీకు నెట్‌ఫ్లిక్స్‌ చార్జీలు బరువుగా అనిపిస్తున్నాయా? అయితే, ఇకపై మీకు ఆ బరువు ఉండదు. నెట్‌ఫ్లిక్స్‌ లో కంటెంట్ చుడొడటం ఇకపై ఫ్రీ గా మారిపోనుంది. ఏమిటి? ఇది ఎలా? అసలే నెట్‌ఫ్లిక్స్‌ డబ్బుల విషయంలో బాదుడే.. బాదుడు అంటుంది.. ఫ్రీ అని చెబుతున్నారు ఏమిటి? అనుకుంటున్నారా? 

డౌటే అక్కర్లేదు ఫ్రీగా కంటెంట్ చూసే అవకాశం కల్పించడానికి నెట్‌ఫ్లిక్స్‌ పెద్ద ప్లానే వేసింది. ఎలా అంటే.. 

Netflix Free Plan:  ఇకపై నెట్‌ఫ్లిక్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను లాంచ్ చేయవచ్చు.  కానీ, ఇది యూట్యూబ్ లాగానే పని చేస్తుంది.  ఏమిటి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారా?  YouTube లాగా Netflix ఎలా పని చేస్తుందో అర్ధం కావడం లేదా. ఏమీ కన్ఫ్యూజ్ లేదు. నెట్‌ఫ్లిక్స్ కస్టమర్‌లకు కంటెంట్‌ను ఉచితంగా చూసే సదుపాయాన్ని అందిస్తుంది, అయితే దీని కోసం వినియోగదారులు కంటెంట్ మధ్య ప్రకటనలను చూడవలసి ఉంటుంది. అంటే.. సినిమా వస్తుంటే మధ్యలో యాడ్స్ కూడా మిమ్మల్ని పలకరిస్తాయన్నమాట. 

నెట్‌ఫ్లిక్స్ ఉచిత ప్లాన్: ఈ ప్లాన్ ఏ దేశాల్లో ముందుగా వస్తుంది?
Netflix Free Plan:  యూరప్-ఆసియాలో నివసిస్తున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ప్లాన్‌ను సిద్ధం చేయడానికి కంపెనీ ఒక ప్రణాళికపై పని చేస్తోందని కంపెనీ ప్లాన్ గురించి తెలిసిన వర్గాలు బ్లూమ్‌బెర్గ్‌తో తెలిపాయి. అయితే, నెట్‌ఫ్లిక్స్ యాడ్ ఫ్రీ ప్లాన్‌ను భారతదేశంలో కూడా తీసుకువచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎందుకంటే, ఎక్కడైతే ఫ్రీగా సినిమాలు చూసే యాప్స్ అందుబాటులో ఉన్నాయో.. ఆ దేశాల్లో ముందుగా నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ ప్లాన్ తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ ఆలోచిస్తున్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. Netflix భారతదేశంలో ఈ ప్లాన్‌ను ప్రారంభించినట్లయితే, Netflixలో మీకు ఇష్టమైన షోలు, సినిమాలు చూడటానికి మీరు డబ్బు ఖర్చు చేయనవసరం లేదు, మీరు ఫ్రీగా ఈ కంటెంట్ చూడగలుగుతారు. కాకపొతే యాడ్స్ ఉంటాయి. 

Netflix Free Plan:  నెట్‌ఫ్లిక్స్ ఇంకా ఈ ప్లాన్ విషయంలో ఇంకా ఆలోచనల దశలోనే ఉందని రిపోర్ట్స్ వెల్లడించాయి. అయితే,  కంపెనీ ఇంతకుముందు కెన్యాలో నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ సర్వీస్ ను టెస్ట్ చేసింది. ఆ తరువాత ఈ సర్వీస్ నిలిపివేశారు.  గత కొన్ని సంవత్సరాలుగా, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్‌స్టార్ వంటి OTT యాప్‌ల నుండి నెట్‌ఫ్లిక్స్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. నెట్‌ఫ్లిక్స్ ఇంకా ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్ యాడ్ సపోర్టెడ్ ప్లాన్ గురించి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ ఉచితం అయితే, ప్రజలు పెద్ద ఎత్తున ప్లాట్‌ఫారమ్‌లో చేరతారు.

భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లు
ప్రస్తుతం, భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ చౌకైన మొబైల్ ప్లాన్ ధర రూ.149. నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 649 వరకు ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు