/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-08T122600.608-jpg.webp)
Netflix CEO Meets Megastar & Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు. అంతే కాదు RRR సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ప్రముఖ హాలీవుడ్ సెలెబ్రెటీస్, డైరెక్టర్స్ ఎంతో మంది గొప్ప నటీ నటులను కలిశారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. దీని పై నెట్ ఫ్లిక్స్ (Netflix) సీఈవో 2022 లో మోస్ట్, బెస్ట్ రెవల్యూషనరీ సినిమా RRR అని ట్వీట్ కూడా చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Screenshot-2023-12-08-122807.png)
Also Read: వరద బాధితులకు సాయం చేసిన నయన్..తిట్టిపోస్తున్న జనం..ఎందుకంటే!
ఇక ఇప్పుడు ఏకంగా నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ (Ted Sarandos) స్వయంగా మెగాస్టార్ ఇంటికి వెళ్లి మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గురువారం హైదరాబాద్ వచ్చిన నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. అక్కడ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ తో కూడా మాట్లాడారు. టెడ్ అందరితో కాసేపు ముచ్చటించిన అనంతరం.. వీరందరితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రామ్ చరణ్ తో ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేయబోతున్నారా..? లేదా మామూలుగానే కలిశారా..? అని పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Screenshot-2023-12-08-122807.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Screenshot-2023-12-08-122822.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Screenshot-2023-12-08-122831.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-08T122600.608-1-jpg.webp)
Also Read: Guntur Kaaram: ‘కేరళలో’ మహేష్ బాబు గుంటూరు కారం..!
Follow Us