Nepal Politics: కుప్పకూలిన నేపాల్‌ ప్రభుత్వం..ప్రధాని ప్రచండకు పదవీ గండం!

నేపాల్‌ లో ప్రభుత్వం కుప్పకూలింది. తమ మద్దతును ఉపసంహరించుకుంటూ సంకీర్ణ మంత్రులు అంతా ఒకేసారి రాజీనామా చేశారు. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ను పదవీ విరమణ చేయాలని డిమాండ్‌ చేసింది.

New Update
Nepal Politics: కుప్పకూలిన నేపాల్‌ ప్రభుత్వం..ప్రధాని ప్రచండకు పదవీ గండం!

Nepal PM Loses Majority: నేపాల్‌ లో ప్రభుత్వం కుప్పకూలింది. తమ మద్దతును ఉపసంహరించుకుంటూ సంకీర్ణ మంత్రులు అంతా ఒకేసారి రాజీనామా చేశారు. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) బుధవారం ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ను (Pushpa Kamal Dahal) పదవీ విరమణ చేయాలని డిమాండ్‌ చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రచండ సహకరించాలని నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ సూచించింది.

మాజీ గెరిల్లా నాయకుడైన ప్రచండను (Prachanda) ప్రధాని పదవి నుంచి తొలగించేందుకు, అధికార సంకీర్ణ కూటమి భాగస్వామి అయిన సీపీఎన్-యూఎంఎల్​ నిర్ణయించుకుంది. ఇప్పటికే ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది.

'నేపాలీ కాంగ్రెస్​, యూఎంఎల్​ కలిసి కొత్త ఏర్పాటు చేస్తాయి. ప్రధాని పదవికి పుష్ప కమల్ దహల్ ప్రచండ రాజీనామా చేయాలి' అని దేవ్​బా స్పష్టం చేశారు. ఖాట్మండు శివార్లలోని బుధానిలకంఠలో తన నివాసంలో జరిగిన పార్టీ కీలక సమావేశం అనంతరం ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ ప్రధానులైన 'నేపాలీ కాంగ్రెస్' అధ్యక్షుడు దేవ్​బా, 'కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్​ - యూనిఫైడ్​ మార్క్సిస్ట్​, లెనినిస్ట్​' ఛైర్మన్ కేపీ శర్మ ఓలి సోమవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంట్లో మిగిలిన కాలమంతా రోటేషన్​ పద్ధతిలో ప్రధానమంత్రి పదవిని పంచుకునేందుకు పరస్పర అంగీకారానికి వచ్చారు.

Also Read: బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత… అపోలోకి తరలింపు

Advertisment
Advertisment
తాజా కథనాలు