AP: సచివాలయం ఎదుట మృతదేహంతో ధర్నా..!

ఉమ్మడి నెల్లూరు జిల్లా విందూరు గ్రామంలో మృతదేహంతో సచివాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్మశానానికి వెళ్లేందుకు ఉన్నదారిని కొంతమంది ఆక్రమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు వెళ్లేదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

AP: సచివాలయం ఎదుట మృతదేహంతో ధర్నా..!
New Update

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరు గ్రామంలో మృతదేహంతో సచివాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విందూరు గ్రామానికి స్మశానానికి వెళ్లేందుకు ఉన్నదారిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని.. ఎవరైనా గ్రామంలో చనిపోతే వారిని స్మశానానికి తీసుకువెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: వితంతువుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు.. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా అంటూ..!

గ్రామానికి చెందిన ఆదెమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లే దారి లేక..  ఎటు తీసుకోని తెలియక బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సచివాలయం ఎదుట శవంతో నిరసన చేపట్టారు.

గత 50 ఏళ్ల నుండి గ్రామానికి సమీపంలో ఉన్న నాలుగు ఎకరాల భూమిని స్మశానం కోసం వాడుకుంటున్నామని అయితే, నేడు ఆ స్థలం ఆక్రమణలకు గురవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు జిల్లా కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లినా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని వాపోయారు.

#nellore
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి