AP: అమానవీయ ఘటన.. రూ.10 వేలకు బిడ్డను అమ్ముకున్న తల్లి.. కారణం ఇదే..!

నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్త్రీ, శిశు సంరక్షకురాలిగా విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళ 48 ఏళ్ల వయసులో గర్భం దాల్చి తనకు పుట్టిన బిడ్డను రూ.10 వేలకు అమ్ముకుంది. వివాహేతర సంబంధం కారణంగా పుట్టిన బిడ్డ కావడంతోనే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది.

AP: అమానవీయ ఘటన.. రూ.10 వేలకు బిడ్డను అమ్ముకున్న తల్లి.. కారణం ఇదే..!
New Update

Nellore: నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొన్నలూరు మండలంలోని ఓ గ్రామంలో స్త్రీ, శిశు సంరక్షకురాలిగా విధులు నిర్వహిస్తోన్న ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. అనంతరం వేరే వ్యక్తితో సహ జీవనం చేసి 48 వయసులో గర్భం దాల్చింది. ఈ నెల 21న కందుకూరు వైద్యశాలలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

Also Read: సీఎం చంద్రబాబు సీరియస్‌.. కేబినెట్‌ భేటీలోనే వారిపై..

రక్తహీనత, నిమోనియాతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తన పక్కనే బెడ్‌పై ఉన్న మరో మహిళ, ఆమె భర్తతో మాటలు కలిపింది. తనకు పుట్టిన బిడ్డను వేరే ఎవరికైనా విక్రయిస్తానని చెప్పింది. దీంతో వారు ఈ విషయమై తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన తమ బంధువులను సంప్రదించారు.

Also Read: సంగం డెయిరీ దగ్గర ఉద్రిక్తత.. రైతుల ఆందోళన..!

అక్కడి నుంచి వచ్చిన సమ్మతం మేరకు పొత్తిళ్లలోని శిశువును ఖమ్మంకు తీసుకెళ్లి అప్పగించారు. బంధువుల నుంచి రూ. 10 వేలు తీసుకుని శిశువు తల్లికి రూ. 6 వేలు ఇచ్చి మిగిలిన రూ. 4 వేలు వారు తీసుకొన్నారు. తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఒంగోలు ఆసుపత్రి నుంచి బాలింత ఒకరు శిశువుతో సహా కనిపించకుండా వెళ్లిపోయారని ఈ నెల 24న బాలల సంరక్షణ కమిటీ దృష్టికి వచ్చింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింద.

#nellore
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe