CM Chandrababu: ఏపీ ఎన్నికల్లో వైసీపీపై కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ విజయం సాధించిన వైసీపీని 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది. అయితే, అధికారంలోకి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పని తీరు బాగోలేని ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
పూర్తిగా చదవండి..AP: సీఎం చంద్రబాబు సీరియస్.. కేబినెట్ భేటీలోనే వారిపై..
పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొంతమంది ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు వస్తోందని కేబినెట్ భేటీలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను మంత్రులు గైడ్ చేయాలని సూచించారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల తీరు వల్ల వచ్చిన మంచిపేరు దెబ్బ తింటోందని ఫైర్ అయ్యారు.
Translate this News: