Hyderabad : పెంపుడు కుక్క పై పొరుగింటి వారి పైశాచికత్వం!

హైదరాబాద్‌ లో అమీర్‌ పేట సమీపంలో ఉండే మధురానగర్‌-రహమత్‌ నగర్‌ లో దారుణ ఘటన జరిగింది. పొరుగింటి వారి పెంపుడు కుక్క తమ ఇంటిలోకి వచ్చిందని కుక్క తో పాటు దాని యజమాని కుటుంబాన్ని కర్రలతో చితకబాదారు.

New Update
Hyderabad : పెంపుడు కుక్క పై పొరుగింటి వారి పైశాచికత్వం!

Pet Dog Came Into The House : హైదరాబాద్‌(Hyderabad) లో అమీర్‌ పేట సమీపంలో ఉండే మధురానగర్‌-రహమత్‌ నగర్‌ లో దారుణ ఘటన జరిగింది. పొరుగింటి వారి పెంపుడు కుక్క(Pet Dog) తమ ఇంటిలోకి వచ్చిందని కుక్క తో పాటు దాని యజమాని కుటుంబాన్ని కర్రలతో చితకబాదారు పొరుగింటి వారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ సోషల్ మీడియా(Social Media) లో ప్రస్తుతం వైరల్‌ గా మారింది.

మధురానగర్‌- రహమత్‌నగర్‌లో శ్రీనాథ్‌, ధనుంజయ్‌ అనే వ్యక్తులు ఒకే కాలనీలో ఎదురెదురు ఇళ్లలో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీనాథ్ పెంచుకుంటున్న కుక్క ధనుంజయ్‌ ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాసేపు వాదులాడుకున్నారు. కుక్కను పెంచుకోవడం గురించి శ్రీనాథ్‌కు ధనుంజయ్‌ వార్నింగ్ ఇచ్చాడు.

గొడవ సద్దుమణిగిన తరువాత శ్రీనాథ్‌ తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్ వెళ్లాడు. కాస్త దూరం వెళ్లేసరికి ధనుంజయ్‌ తన స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌ మీద దాడి చేయడం స్టార్ట్ చేశాడు. ముందు శ్రీనాథ్‌పై దాడి చేశాడు. తర్వాత కుక్కపై కూడా కర్రలతో దాడి చేశారు. అక్కడితో ఆగిపోకుండా అడ్డు వచ్చిన శ్రీనాథ్‌ భార్య స్వప్న పై కూడా దాడి చేశారు. కాలనీ రోడ్డుపై భార్యభర్తలు ఇద్దర్నీ కర్రలతో చితకబాదారు. స్థానికులు అడ్డుకుంటున్నా... వద్దని దండం పెడుతున్నా ఆ కుర్రాళ్లు ఆగలేదు వారివైపు అరుస్తూ వస్తున్న కుక్కపై కూడా దాడి చేశారు. ఈ దృశ్యాలు అన్నీ కూడా స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాకు చిక్కాయి.

తీవ్రగాయాలతో శ్రీనాథ్‌, ఆయన భార్య, పెంపుడు కుక్క చికిత్స తీసుకుంటున్నారు. స్థానికులతో పాటు, శ్రీనాథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ చూసిన పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read: మీటింగ్‌ నుంచి తిరిగి వస్తుండగా ప్రధాని పై కాల్పులు..ఆస్పత్రికి తరలింపు!

Advertisment
తాజా కథనాలు