/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-24-2-jpg.webp)
lok sabha: బోల్డ్ బ్యూటీ నేహా శర్మ మరో అవతారం ఎత్తబోతుంది. వృత్తి రిత్యా మోడల్ అయిన మెగా హీరో రామ్ చరణ్ సరసన ‘చిరుత’ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టి నటిగానూ రాణిస్తోంది. అయితే ఇటీవల సినిమా అవకాశాల్లేక సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తున్న ఆమె.. రాజకీయా నాయకురాలిగా ప్రస్థానం మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
❤️☀️🌈💫🌸 pic.twitter.com/paiU4YIGz9
— Neha Sharma (@Officialneha) April 19, 2022
భగల్ పూర్ నుంచి బరిలోకి..
ఈ మేరకు 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. నేహాశర్మ తండ్రి కాంగ్రెస్ నాయకుడు అజయ్ శర్మ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని, బీహార్ లోని భగల్ పూర్ నుంచి ఆమెను ఎంపీగా పోటీ చేయించబోతున్నట్లు చర్చ జరుగుతోంది. దీనిపై మీడియాతో మాట్లాడిన అజయ్ శర్మ.. ‘బీహార్ లోని భగల్ పూర్ లో కాంగ్రెస్ కు మంచి పట్టు ఉంది. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో ఈ స్థానం కాంగ్రెస్ కు దక్కాలి. అనుకున్నట్లుగా సీటు మా పార్టీకే వస్తే నేను లేదా నా కూతురు నేహాశర్మ పోటీలో దిగుతాం. తుది నిర్ణయం మాత్రం అధిష్టానానిదే’ అని స్పష్టం చేశారు.
Hydration is the key ;) pic.twitter.com/prBoc0dokn
— Neha Sharma (@Officialneha) April 9, 2022
ఇది కూడా చదవండి:TET: టెట్ అభ్యర్థులకు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్.. ఉద్యమ బాటలో నిరుద్యోగులు!
ఇక ‘చిరుత’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆమె కొంతకాలానికి తెలుగులో అవకాశాల్లేక బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ పలు సినిమాలతోపాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది.
Follow Us