NEET UG EXAM Pattern : దేశవ్యాప్తంగా మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం పెన్-పేపర్ ఆధారిత నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET UG) మే 5, 2024న నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) NEET UG కోసం ఆన్లైన్ అప్లికేషన్ విండోను తెరిచింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 9 వరకు ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయవచ్చు. MBBS, BAMS, BUMS, BSMS కాకుండా, BHMS లో ప్రవేశం కూడా NEET UG మెరిట్ స్కోర్ ఆధారంగా జరుగుతుంది.
13 భారతీయ భాషలలో పరీక్ష:
NEET UG 2024 పరీక్ష హిందీ, ఇంగ్లీషుతో సహా 13 భారతీయ భాషలలో నిర్వహించనున్నారు. పరీక్ష హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, ఒరియా, మలయాళం, కన్నడ, పంజాబీ, ఉర్దూ భాషలలో ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు.
నెగెటివ్ మార్కింగ్:
యూజీ పరీక్షను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే 3 విభాగాలుగా విభజించారు. పరీక్షా మాధ్యమం పెన్-పేపర్ ఆధారంగా అంటే ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. ఇది మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 వరకు ఉంటుంది. ఇందులో మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఫిజిక్స్ విభాగంలో 35 అండ్ 15 ప్రశ్నలు (45 ప్రశ్నలు పరిష్కరించాల్సి ఉంటుంది), కెమిస్ట్రీ విభాగంలో 35 అండ్ 15 ప్రశ్నలు (45 ప్రశ్నలు పరిష్కరించాల్సి ఉంటుంది) ఉంటాయి. బయాలజీ-జువాలజీలో 35 అండ్ 15 ప్రశ్నలు, ప్లాంట్ సైన్స్‌లో 35 అండ్ 15 ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు సబ్జెక్టుల్లో 45-45 ప్రశ్నలను పరిష్కరించాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోని-బి విభాగంలో 15 ప్రశ్నలకు 10 మాత్రమే రాయాలి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక మార్కు కట్ చేస్తారు. పరీక్ష 720 మార్కులకు ఉంటుంది.
Also Read : మరో నెలలో పెళ్లి..ఇంతలోనే మెడికో విద్యార్థిని ఆత్మహత్య!
WATCH: