BIG BREAKING: నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా

నేటి  నుంచి జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ ను వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని ఎన్టీయే తెలిపింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ కౌన్సిలింగ్ వాయిదా వేసినట్లు వెల్లడించింది. కాగా ఎల్లుండి నీట్ పరీక్షలపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

New Update
NEET: రీ ఎగ్జామ్‌లో తేలిపోయిన టాపర్లు

NEET UG counselling:నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని ఎన్టీయే తెలిపింది. నేటి  నుంచి జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీయే ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ కౌన్సిలింగ్ వాయిదా వేసినట్లు వెల్లడించింది. కాగా ఎల్లుండి నీట్ పరీక్షలపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

ఎంబీబీఎస్, బీడీ ఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే యూజీ నీట్‌–2024 అడ్మిషన్‌ కౌన్సిలింగ్‌పై విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మే 5వ తేదీన ఈ పరీక్షను ఎన్టీయే నిర్వహించగా.. జూన్‌ 4వ తేదీన ఫలితాలను ప్రకటించింది. ఆ తర్వాత గ్రేస్‌ మార్కుల వ్యవహారంపై తీవ్ర దుమారం రేగడంతో ఆయా అభ్యర్థులకు తిరిగి జూన్‌ 23న పరీక్ష నిర్వహించింది.

ఆ తర్వాత జూన్‌ 30న ఎన్టీయే తుది ఫలితాలను ప్రకటించింది. మరోవైపు జూలై 6వ తేదీ అంటే ఈరోజు నుంచి ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు మెడికల్‌ కౌన్సిలింగ్‌ కమిటీ (ఎంసీసీ) యూజీ నీట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించకపోవడంతో విద్యార్థులు సందిగ్ధంలో ఉన్నారు. తాజాగా కౌన్సిలింగ్ ను నిలిపివేస్తున్నట్టు ఎన్టీయే ప్రకటించింది. దీంతో విద్యార్థులలో ఇంకా టెన్షన్ నెలకొంది.

ఇదిలా ఉంటే సుప్రీం కోర్టులో నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలనే పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై ఎల్లుండి సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు పరీక్షలు రద్దు చేయాల్సిన పని లేదని కేంద్రం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ దేశంలో నెలకొంది.

Advertisment
తాజా కథనాలు