NEET-UG: నీట్ గందరగోళం మధ్య విద్యార్థుల్లో పెరుగుతున్న స్ట్రెస్.. ఎలా తగ్గించుకోవాలంటే..

నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకల కారణంగా అధిక శాతం పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నారు. గడిచిన రెండేళ్లో 13వేలకు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని NCRB వెల్లడించింది. పిల్లలను డ్రిప్రెషన్ కు దూరం చేసే నిపుణుల సూచనల కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

NEET-UG: నీట్ గందరగోళం మధ్య విద్యార్థుల్లో పెరుగుతున్న స్ట్రెస్.. ఎలా తగ్గించుకోవాలంటే..
New Update

NEET: వైద్య ప్రవేశ పరీక్ష NEET-UG 2024 ఫలితాలు వెలువడినప్పటి నుంచి దేశంలో ఉత్కంఠ నెలకొంది. అనేక రాష్ట్రాల్లో గ్రేస్ మార్కుల విషయంలో వివాదం తలెత్తింది. హర్యానాలో ఒకే సెంటర్‌కు చెందిన 6గురు చిన్నారులు 720 మార్కులు సాధించడంతో అక్రమాలు చోటుచేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులు మళ్లీ పరీక్షకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అధికారుల నిర్లక్ష్యం, అవకతవకల మధ్య విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా ప్రయత్నించారు. నీట్‌కు ప్రిపేర్ అయ్యేందుకు కోటాలో నివసిస్తున్న మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన విద్యార్థి ఫలితాలు వెలువడిన రెండో రోజున ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలన రేపింది. కోచింగ్ హబ్ గా పేరొందిన కోటాలో ఈ ఏడాది ఇది 11వ ఆత్మహత్య ఘటన. కాగా 2023 నుంచి ఇప్పటివరకూ 29 మంది నీట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే పిల్లలో ఆందోళన, భయం తగ్గించి, విలువైన జీవితాన్ని అర్థాంతరంగా ముగించకుండా పేరెంట్స్ పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తల్లిదండ్రులకు కీలక సూచనలు..
ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం 2022లో భారతదేశంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 7.6% మంది నీట్ విద్యార్థులు ఉన్నారు. 18 ఏళ్లలోపు 1,123 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పరీక్షల్లో ఫెయిల్ కావడమే కారణం. వీరిలో 578 మంది బాలికలు, 575 మంది బాలురు ఉండటం ఆందోళన కలిగించే అంశం. కాగా ఈ నేపథ్యంలో ప్రముఖ నిపుణులు విద్యార్థుల, తల్లిదండ్రులకు కీలక సూచనలు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఎలా సహాయపడగలరు? విద్యార్థులు తమ మానసిక ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి? పిల్లల పరీక్షల సమయంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి? అనే విలువైన సూచనలు ఇస్తున్నారు.

వెయ్యి సార్లు విఫలమైన థామస్ ఆల్వా ఎడిసన్..
అమెరికన్ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ వెయ్యి సార్లు విఫలమైనప్పటికీ బల్బును సృష్టించాడు. పట్టు వదలకుండా ఎట్టకేలకు నేడు ప్రపంచాన్ని వెలిగించే బల్బును కనిపెట్టాడు. అతని చిన్నతనంలో మానసిక రుగ్మత గల వ్యక్తిగా పరిగణించబడ్డాడు. పాఠశాల నుంచి బయటకు పంపించేశారు. కానీ అతను తన ప్రతిభ, కృషితో బల్బుతో పాటు వేలాది జీవితాలను మార్చే ఆవిష్కరణలను చేసాడు. అందుకే తక్కువ స్కోర్ లేదా పరీక్షలో ఫెయిల్ కావడం మీ భవిష్యత్తును నిర్ణయించదు. మీరు ఈ రోజు బాగా రాణించలేకపోతే మీరు తదుపరిసారి తప్పకుండా లక్ష్యాన్ని చేరుతారు. మరోసారి కష్టపడి పనిచేస్తాననే పట్టుదల ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు. ఒక్క పరీక్ష జీవితానికి ముగింపు కాదు. ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఓడిపోయినా గెలిచేవాడిని అలెగ్జాండర్ అని అంటారు. అదేవిధంగా ఏ పోటీ పరీక్షలూ మీ సామర్థ్యాన్ని చెప్పలేవు. మీరు ఈ రోజు బాగా చేయలేకపోయినట్లయితే మీరు రేపు ఇంకా బాగా చేస్తారు. మీపై నమ్మకం ఉంచుకోవడం మాత్రమే ముఖ్యం. జీవితం చాలా పెద్ది. ఈరోజు కాకపోతే రేపు మన కలలను నెరవేర్చుకోవచ్చు. కలలను నెరవేర్చుకోవడానికి ఒక వ్యక్తికి సంకల్ప శక్తి, విశ్వాసం, నేర్చుకోవాలనే కోరిక ఉండాలి.

ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సరైన సలహాలు..
పరీక్షల కారణంగా డిప్రెషన్‌కు గురవుతున్న పిల్లలు వందల సంఖ్యలో ఉన్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సరైన సలహాలు, మార్గం లేకపోవడమే ఒత్తిడికి కారణం. ఏకకాలంలో బహుళ సబ్జెక్టులు పూర్తి చేయలేనప్పుడు ఒత్తిడికి గురవుతారు. ఎక్కువమంది పిల్లలు తరచుగా పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించలేనప్పుడు నిరాశ చెందుతారు. అందువల్ల లక్ష్యాలను చిన్న చిన్న పార్టుగాలుగా డివైడ్ చేసుకోవాలి. మొదట చిన్న లక్ష్యాలను సాధించడం మీకు సంతృప్తిని ఇస్తుంది. పరీక్ష రాసిన తర్వాత, ఫలితాలు వెలువడే ముందు పిల్లలు ఎవరితోనూ ఎక్కువగా చర్చించకూడదు. స్నేహితులను అడిగారు, మీరు ఏమి అనుకుంటున్నారు, ఎంత శాతం వస్తుంది. ఇలాంటివి ఒత్తిడిని పెంచుతాయి. ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరం పాటించండి. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఎప్పుడూ పరీక్షలు, ఫలితాలకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల ముందుగా దాని నుండి దూరం ఉంచండి. బదులుగా మరొక దానితో కనెక్ట్ అవండి.

తల్లిదండ్రులు పిల్లలకు నిజమైన స్నేహితులు..
మీరు మీ అభిరుచితో కనెక్ట్ కావచ్చు. మీరు ఏదైనా ప్రేరణాత్మక పుస్తకాన్ని చదవవచ్చు. నచ్చిన గురువుతో మాట్లాడటం ద్వారా మీ మనస్సును తేలిక చేసుకోండి. మీరు ఏదైనా విషయంలో చాలా ఒత్తిడిగా లేదా గందరగోళంగా ఉన్నట్లయితే మీ గురువుతో చర్చించండి. మీరు ఏ ఉపాధ్యాయుడితోనైనా బహిరంగంగా మాట్లాడవచ్చు. వారిని కలవండి లేదా వారికి కాల్ చేసి మీ సమస్యను పంచుకోండి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. లేదా మీరు దీని గురించి మీ తల్లిదండ్రులతో కూడా మాట్లాడవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు నిజమైన స్నేహితులు అవుతారు. పిల్లలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు తల్లిదండ్రుల మద్దతు చాలా ముఖ్యం. చదువుల ఒత్తిడిని అధిగమించడానికి వారు తమ పిల్లలకు బాగా సహాయపడగలరు. ఎందుకంటే తల్లిదండ్రుల కంటే పిల్లలను ఎవరూ బాగా అర్థం చేసుకోలేరు.

#students-sucide #neet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి