NEET: నీట్ పీజీ పరీక్ష వాయిదా.. రేపు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామ్నది త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీయే తెలిపింది. By Manogna alamuru 22 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి రేపు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామ్నది త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీయే, కేంద్ర విద్యాశాఖ తెలిపింది. నీట్ పరీక్ష, ఫలితాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల విడుదలైన నీట్ రిజల్ట్‌లో ఏకంగా 67 మంది ఫ్టస్ట్ ర్యాంకు రావడం అనుమానాలకు దారి తీసింది.దీనిలో ఎనిమిది మందిది ఒకే పరీక్షా కేంద్రం కావడం గమనార్హం. దీంతో పాటూ కొందరు విద్యార్ధులకు అదనపు మార్కులు రావడం లాంటి విషయాలు కూడా కూడా అనుమానాలను రేకెత్తించింది. దీంతో నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో కేంద్రం ఈ పరీక్ష మీద ఒక నిర్ణయం తీసుకుంది. సమయం కోల్పోయి గ్రేస్ మార్కులు పొందిన విద్యార్ధులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షను కూడా వాయిదా వేసింది ఎన్టీయే. ప్రస్తుతం నీట్ ఫలితాల చుట్టూ వివాదాలు నెలకొనడం, దీనికి సంబంధించి కేసు సుప్రీంకోర్టులో నడుస్తుండడం...మరోవైపు యూజీసీ నెట్ పరీక్షను కూడా రద్దు చేయడంతో ఇప్పుడు నీట్ పీజీ పరీక్షను కూడా రద్దు చేయాలని కేంద్ర వైద్యశాఖ నిర్ణయించింది. The NEET-PG Entrance Examination scheduled to be held tomorrow has been postponed. The fresh date of this examination will be notified at the earliest: Ministry of Health Taking into consideration, the recent incidents of allegations regarding the integrity of certain… pic.twitter.com/kxyjN11E93 — ANI (@ANI) June 22, 2024 #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి