Neeraj Chopra Catches Indian Flag: ఆసియా గేమ్స్‌లో(Asia Games 2023) ఇండియన్ అథ్లెట్స్ అదరగొడుతున్నారు. తమ ప్రతిభతో పతకాలను కొల్లగొడుతున్నారు. 2018 ఆసియా గేమ్స్ రికార్డ్‌ను చరిపేస్తూ పతకాల వేట సాగిస్తున్నారు. 2018 ఆసియా గేమ్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ 70 మెడల్స్ సాధించగా.. ఈ సారి సెంచరి వైపు దూసుకెళ్తున్నారు ప్లేయర్స్. ఇప్పటి వరకు ఇండియన్ ప్లేయర్ 85 మెడల్స్ సాధించారు. వీటిలో 21 గోల్డ్ మెడల్స్, 32 సిల్వర్, 33 బ్రోంజ్ పతకాలు ఉన్నాయి. పతకాల పరంపర కొనసాగుతుండటంతో ఆటగాళ్ల సంతోషానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఇకపోతే.. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, కిషోర్ జెనా మొదటి స్థానంలో నిలవడంతో భారత్ స్వర్ణం, రజతం సాధించారు. వరుసగా రెండవ పతకం. అలాగే పురుషుల 4x400 మీటర్ల రిలేలో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
అయితే, ఈ విజయాలను ఇండియన్ అథ్లెట్స్ మైదానంలోనే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇతర అథ్లెట్లతో కలిసి నీరజ్ చోప్రా తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా వారందరితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సందర్భంగా అభిమానులకు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ జాతీయ జెండానున తమ భుజాలపై కప్పుకుని ఆనందం వ్యక్తం చేశారు. కాగా, అథ్లెట్లు ఫోటోలకు ఫోజులు ఇవ్వగా.. ఈ గేమ్స్ వీక్షించడానికి వెళ్లిన ఇండియన్ ప్రేక్షకులు.. వారిని తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఇంతలో ఓ వ్యక్తి నీరజ్ చోప్రాకు ఇండియన్ ఫ్లాగ్ అందజేయబోయాడు. అతను దూరంగా ఉండటంతో.. ఆ ఫ్లాగ్‌ను నీరజ్ వైపు విసిరాడు. అయితే, జస్ట్ మిస్ అయితే.. ఆ ఫ్లాగ్ కింద పడేది. కానీ, ఇండియన్ ఫ్లాగ్ కింద పడకుండా.. నీరజ్ స్వల్పంగా డై వేసి మరీ క్యాచ్ పట్టేశాడు.
ఇండియన్ ఫ్లాగ్‌ను నీరజ్ క్యాచ్ పట్టడానికి ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. వీడియోను చూసి ఇండియన్స్ నీరజ్‌కు సెల్యూట్ చేస్తున్నారు. దేశం మీద భక్తికి నిదర్శనం ఇది అని కామెంట్స్ పెడుతున్నారు. పతకాలు గెలిచిన ప్లేయర్స్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
నీరజ్ క్యాచ్ కు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి..
Also Read: